Salman Khan: తాను ఒక్కతే నా గర్ల్ ఫ్రెండ్.. హీరోయిన్ గురించి వైరల్ అవుతున్న సల్మాన్ మాటలు..!
58 ఏళ్ల వయసులో కూడా సింగిల్ గానే ఉన్న సల్మాన్ ఖాన్.. సంగీత బిజలాని, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్ వంటి చాలామంది హీరోయిన్ లతో.. డేటింగ్ చేశారు. తాజాగా సల్మాన్ ఖాన్ తన గర్ల్ ఫ్రెండ్ ఒక్కరే అంటూ.. చెప్పిన ఒక పాత వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో మళ్ళీ వైరల్ అవుతోంది.
ఒక టీవీ గేమ్ షోకి ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు.. సల్మాన్ ఖాన్ కు ఒక ప్రశ్న ఎదురైంది. మీకు ఇష్టమైన గర్ల్‌ఫ్రెండ్.. ఎవరు అని ఒక అబ్బాయి అడిగాడు. దీనికి సల్మాన్ ఖాన్ స్పందిస్తూ, "నాకు ఇప్పటిదాకా ఒకే గర్ల్‌ఫ్రెండ్ ఉంది. అది ఎవరంటే.." అని జవాబు ఇవ్వకుండానుంచున్నారు.
వెంటనే స్టేజ్ మీద ఉన్న ఆ అబ్బాయి కత్రినా కైఫ్ అని అన్నాడు. దీంతో షాక్ అయినా సల్మాన్ ఖాన్ నవ్వి "ఈ అబ్బాయి నా గర్ల్‌ఫ్రెండ్ కత్రినా కైఫ్.. అని చెబుతున్నాడు" అని అన్నారు. అదే స్టేజ్ మీద ఉన్న మహిళ నిజమే కదా అంటున్నాడు అని అనగా, సల్మాన్ మరింత ఆశ్చర్యపోయారు.
"ముంబై ప్రతి పిల్లాడికి తెలుసు అన్నమాట. నేనే ఎవరికీ తెలియదు అనుకున్నాను. ఎలా అనిపిస్తుంది నీకు కత్రినా కైఫ్" అని సల్మాన్ అడగగా ఆ అబ్బాయి బావుంటుంది అన్నాడు. దానికి సల్మాన్ కూడా నాకు కూడా బాగా అనిపిస్తుంది..అని నవ్వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
సల్మాన్ ఖాన్ తో బ్రేక్ అప్ తర్వాత, ఐశ్వర్యా రాయ్ 2007లో హీరో అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరోవైపు కత్రినా కైఫ్ కూడా సల్మాన్ ఖాన్ తర్వాత కొన్నాళ్ళు రణబీర్ కపూర్ తో డేటింగ్ చేశారు. 2021లో విక్కీ కౌశల్ ను వివాహం చేసుకున్నారు.