Samantha: ప్లీజ్ వెయిట్ తగ్గొచ్చుకదా.. నెటిజన్‌కు చుక్కలు చూపించిన సమంతా.. ఏమందో తెలుసా..?

Tue, 05 Nov 2024-5:19 pm,

సమంతా కొన్ని రోజులుగా తరచుగా ఏదో ఒక అంశాలతో వార్తలలో ఉంటున్నారు. కొన్నిసార్లు కాంట్రవర్సీ అంశాలతో వార్తలలో ఉంటే, మరికొన్ని సార్లు తను చేస్తున్న మూవీ అంశాల గురించి అప్ డేట్ లు ఇస్తు వార్తలలో ఉంటున్నారు. తాజా అంశంతో మళ్లీ సామ్ వార్తలలో నిలిచారు

కొన్నిరోజులుగా సమంతా వరుణ్ ధావన్ తో తీసిన సిటాడేల్ వెబ్ సిరిస్ లో బిజీగా ఉంటున్నారు. అయితే ఆమె ప్రస్తుతం ఆమె ఈ వెబ్ సిరిస్ లో ప్రమోషన్ లలో ఉన్నారు. ఆమె అభిమానులతో సరదాగా చిట్ చాట్ లో పాల్గొన్నారు.   

ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ..కొంత మంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సరదగా బదులిచ్చారు. చైతుతో విడిపోయిన తర్వాత ఎంతో మనస్తాపానికి గురయ్యారు. అంతే కాకుండా.. అప్పుడు మయోసైటిస్ బారిన కూడా పడ్డారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు సెట్స్ కు దూరంగా సైతం ఉన్నారు.  

తాజాగా, ఇన్ స్టాలో సమంతా మళ్లీ అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒక అభిమాని  సమంతకు.. మిమ్మల్ని ప్రేమిస్తున్నారని, మీతో పాటు ఉండాలని ఉందని కూడా చెప్పాడంట. దీనికి సమంతా ఎంతో పొంగిపోయింది. అంతే కాకుండా మీ అభిమానానికి థైంక్స్  అంటూ కూడా పొంగిపోయింది.  

కానీ మరో అభిమాని మాత్రం.. ఆమెను మీరు వెయిట్ పెరగాలని కూడా కామెంట్లు చేశాడంట. అప్పుడు సామ్ ఒక్కసారిగా మళ్లీ ఎమోషనల్ అయ్యింది. అంతే కాకుండా.. ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతారని కాస్తంత సీరియస్ అయ్యింది. అంతే కాకుండా.. తాను ఎంతో కష్టపడి ఇలాంటి పొజిషన్ కు వచ్చానని ఇప్పుడు మళ్లీ ఇలాంటి మాటలతో ఇబ్బంది పెట్టొద్దని చెప్పుకొచ్చిందంట.

తనను ఇలా బతకనివ్వాలని మళ్లీ మళ్లీ ఇబ్బందులు పెట్టేలా మాట్లోడొద్దని కూడా సామ్ సదరు నెటిజన్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఒకర్ని జడ్జీ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కూడా కామెంట్లు చేశారు.  దీంతో ప్రస్తుతం సామ్ మరోసారి వార్తలలో నిలిచారని చెప్పుకొవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link