NTR Vs ANR Vs Chiru: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
సినీ ఇండస్ట్రీలో పదేళ్ల తర్వాత ఒక సినిమా టైటిల్ ను రిపీట్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ప్రతి దశాబ్దం తర్వాత ఒక సినిమా టైటిల్ ను వేరే సినిమాను పెట్టవచ్చనే రూల్ కూడా ఉంది.
తెలుగులో ఈ తరహా ఒకే సినిమా టైటిల్ తో వేరు వేరు కాలాల్లో సినిమాలు వచ్చాయి. ఒక్కోసారి ఒక సినిమా టైటిల్ సూపర్ హిట్ అయితే దాన్ని వాడుకోవడానికే ఎక్కువ మంది మేకర్స్ ఇష్టపడుతుంటారు.
ఇక 1962లో ఎన్టీఆర్, సావిత్రి హీరో, హీరోయిన్లుగా ‘ఆరాధన’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మ్యూజికల్ గా హిట్ గా నిలిచింది.
వి.మధుసూదన రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను జగపతి ఆర్ట్స్ పిక్చర్ పతాకంపై వీరమాచనేని బాబు రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా బెంగాలీలో వచ్చిన ‘సాగరిక’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.
ఆ తర్వాత 14 యేళ్లకు 1976లో ఇదే ‘ఆరాధన’ టైటిల్ లో ఎన్టీఆర్, వాణిశ్రీ హీరో, హీరోయిన్లుగా బి.వి. ప్రసాద్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా హిందీలో వచ్చిన ‘గీత్’ మూవీకి రీమేక్.
హిందీలో ‘గీత్’ చిత్రం హిమాచల్ ప్రదేశ్ నేపథ్యంలో తెరకెక్కితే.. తెలుగులో కూడా అదే నేటివిటితో తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఎన్టీఆర్ ‘ఆరాధన’ సినిమా వచ్చిన 11 యేళ్లు మెగాస్టార్ చిరంజీవి .. భారతీరాజా దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమా తమిళంలో సత్యరాజ్ హీరోగా తెరకెక్కిన ‘కవితోరా కవితాంగైల్’ మూవీకి రీమేక్. కానీ తెలుగులో చిరు హీరోగా తెరకెక్కిన ‘ఆరాధన’ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలో సెకండ్ హీరోగా రాజశేఖర్ హీరోగా నటించారు.
మొత్తంగా అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, చిరంజీవి హీరోలుగా తెరకెక్కిన ‘ఆరాధన’ మూడు చిత్రాలు కూడా ఇతర భాషల్లో హిట్టైన సినిమాలకు రీమేక్ కావడం విశేషం.
మరోవైపు ఏఎన్నార్, ఎన్టీఆర్ లకు ‘ఆరాధన’ టైటిల్ తో బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకుంటే.. చిరంజీవి మాత్రం ‘ఆరాధన’ టైటిల్ తో ఫ్లాప్ అందుకోవడం విశేషం.