Samsaptaka Rajayogam: శక్తివంతమైన సంసప్తక రాజయోగం త్వరలో, ఆ మూడు రాశులకు మహర్దశే ఎప్పట్నించంటే
.jpg)
3 రాశులపై అమితమైన లాభాలు
హిందూ జ్యోతిష్యం ప్రకారం గురు గ్రహాన్ని ధర్మం, జ్ఞానం, ధనం, తెలివితేటలు, పెళ్లి, సుఖ శాంతులు, సంతానం, ఆధ్యాత్మిక అంశాలకు కారకంగా భావిస్తారు. ఇక శుక్రుడిని భోగ విలాసాలు, కళలు సంగీతం, పెళ్లి జీవితం, ధనం, భౌతిక సుఖాలకు మూలంగా చెబుతారు. ఈ నేపధ్యంలో సంసప్తక రాజయోగం ఎవరిపై ప్రభావం చూపించనుందో చూద్దాం

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు సంసప్తక రాజయోగం మహర్దశ పట్టించనుంది. అంటే కోరుకున్నవన్నీ జరుగుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే గోల్డెన్ డేస్ ప్రారంభమౌతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వేతన పెంపు ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్ధులు రాణిస్తారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు.

ధనస్సు రాశి
ధనస్సు రాశివారికి ఈ సమయం అత్యంత శుభ సమయం. అంటే ఆర్ధికంగా ప్రయోజనం కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది. పెండింగులో ఉన్న డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారులకు కొత్త డీల్స్ చేతికి అందుతాయి. అమితమైన లాభాలు ఆర్జిస్తారు. విద్యార్ధుల కెరీర్ బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
వృషభ రాశి
సంసప్తక రాజయోగం కారణంగా వృషభ రాశి జాతకులకు జీవితంలో ఇక తిరుగుండదు. అంతా మంచి జరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కోరిన కోర్కెలు నెరవేరవచ్చు. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. ఆకశ్మిక ధనలాభం ఉంటుంది.
సంసప్తక రాజయోగం
గురు గ్రహం ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 13న వృశ్చిక రాశిలో ప్రవేశించనున్నాడు. గురు శుక్ర గ్రహాలు ఏడు కోసుల దూరంలో ఉంటాయి. ఫలితంగా సంసప్తక రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం 3 రాశులవారికి మహర్దశ కల్గించనుంది. ఈ మూడు రాశులవారికి జీవితంలో ఇక తిరుగుండదు