Samsung Galaxy A16 5G Launch: వారేవా ఏమి డిజైన్.. చూస్తేనే కొనాలనిపిస్తుంది.. సాంసంగ్ నుంచి చీపెస్ట్ అద్భుతమైన మొబైల్!
ఈ Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ SM-A166P/DS మోడల్ నంబర్‌తో అందుబాటులోకి తీసుకు రానుంది. ఇందులో ఉండే చివరి DS అక్షరాలను కంపెనీ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌గా పేర్కొంది. ఈ మొబైల్ ఇప్పటికే వివిధ రకాల డేటా బేస్‌లో కూడా కనిపించింది.
ఈ Samsung Galaxy A16 5G మొబైల్ 3C లిస్టింగ్ ప్రకారం, శక్తివంతమైన 4860mAh బ్యాటరీని ప్యాక్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా Exynos 1330 5G చిప్‌సెట్‌తో ఇది అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ మొబైల్‌ను ప్రీమియం MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇక దీని బ్యాక్ సెటప్ వివరాల్లోకి వెళితే, ఈ Samsung Galaxy A16 5G మొబైల్ మూడు కెమెరా సెన్సార్స్‌తో రానుంది.
ఈ మొబైల్ సాంసంగ్ కంపెనీ మొత్తం మూడు (లైట్ గ్రీన్, బ్లూ బ్లాక్‌తో పాటు గోల్డెన్) కలర్ ఆప్షన్స్‌లో విడుదల చేయబోతోంది. దీంతో పాటు LED ఫ్లాష్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది.
ఇక Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది యూ ఆకారం డిస్ప్లేతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన 6.7 అంగుళాల U డిస్‌ప్లే సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్‌పై 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా అందిస్తోంది.