Samsung Tv Offers: డెడ్‌ చీప్‌ ధరకే సాంసంగ్‌ 4k పెద్ద టీవీ.. ఎగబడి కొంటున్న జనాలు!

Sun, 21 Jul 2024-5:32 pm,

గతంలో లాంచ్‌ అయిన Samsung స్మార్ట్‌ టీవీపై ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ బ్రాండ్‌ టీవీలపై ప్రత్యేకమైన డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి. 

ముఖ్యంగా ఈ ప్రైమ్‌ డే సేల్‌లో భాగంగా Samsung 108 cm (Crystal 4K Vivid Pro Series) స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేసేవారికి 38 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా కొన్ని బ్యాంక్‌లకు సంబంధించి క్రెడిట్‌ కార్డ్‌లపై ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.  

ఈ స్మార్ట్‌టీవీ అసలు ధర M.R.P రూ. 49,900 కాగా ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 38 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.30,990కే లభిస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన కూపన్స్‌ కూడా లభిస్తున్నాయి.   

ఈ టీవీని మరింత తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునేవారు బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు. దీనిని కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.500 పై తక్షణ డిస్కౌంట్‌ లభిస్తుంది.  

ప్రస్తుతం ఈ Samsung 108 cm స్మార్ట్‌టీవీ ఆరు వేరియంట్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా ఐదు సైజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో 43 స్మార్ట్‌టీవీపై మాత్రమే డిస్కౌంట్‌ లభిస్తోంది.  

ఈ సాంసంగ్ క్రిస్టల్ 4k వివిడ్ ప్రో సిరీస్ టీవీ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. ఇది క్రిస్టల్ 4K ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ప్రీమియం డిస్ల్పేను కలిగి ఉంటుంది.  

ఇక ఈ టీవీ డిస్ల్పే ప్రీమియం HDR, మెరుగైన రంగులు, కాంట్రాస్ట్ సెటప్‌తో లభిస్తోంది. దీంతో పాటు PurColor సెటప్‌తో అందుబాటులోకి రానుంది. ఇది Tizen OS సెటప్‌తో వస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link