Sandes App: సత్తా చాటుతున్న సందేశ్, WhatsAppలో లేని 5 ఫీచర్లు తీసుకొచ్చిన స్వదేశీ యాప్

Mon, 22 Feb 2021-1:54 pm,

ఈ సందేశ్ యాప్(Sandes App) ద్వారా మీ ప్రొఫైల్‌ను మరింత శక్తివంతం చేయవచ్చు. ఉదాహరణకు, మీరు మీ పుట్టినరోజు మరియు జాబ్ లాంటి పలు విషయాలను ఇందులో నమోదు చేయవచ్చు. మీరు ఈ లక్షణాన్ని వాట్సాప్‌లో మీరు పొందలేరు.

Also Read: EPFO: ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి కొత్త PF Tax Rules, దీని ప్రభావం ఇలా ఉండనుంది

దేశంలోని నెటిజన్ల తీరును ఆధారంగా సందేశ్ యాప్‌లో కొత్త ఫీచర్లు తీసుకొచ్చారు. ఉదాహరణకు, స్నేహితుడు లేదా బంధువుతో కనెక్ట్ అవ్వడానికి, మీరు మొబైల్ నంబర్‌పై మాత్రమే ఆధారపడవలసిన అవసరం లేదు. మీరు మీ స్నేహితులు మరియు బంధువులను ఈమెయిల్ ద్వారా సందేశ్ యాప్‌లో కనెక్ట్ చేయవచ్చు.

Also Read: Salary Hike 2021-22: ఈ సంవత్సరం భారత్‌లో ఉద్యోగులకు ఎక్కువ జీతం, రెండంకెల increment, పూర్తి వివరాలు

మీ మొబైల్ నంబర్‌తో కాకుండా మీ ఈమెయిల్ ఐడీతో కూడా సందేశ్ యాప్‌లో లాగిన్ అవ్వవచ్చు. ఇప్పుడు సందేశ్ యాప్‌ను ఏ పరికరం నుంచైనా ఉపయోగించవచ్చు. వాట్సాప్ యాప్‌(WhatsApp)లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేదు.

గత కొన్నేళ్లుగా వాట్సాప్ యూజర్లు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు చాట్‌బాట్‌ను డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఈ సమస్యను సందేశ్ యాప్ ద్వారా పరిష్కరించారు. మీరు సందేశ్‌ యాప్ లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, దాన్ని పరిష్కరించడానికి చాట్‌బాట్ సిద్ధంగా ఉంది. మీరు Help అని టైప్ చేసినప్పుడు చాట్‌బాట్ మీకు సహాయం చేస్తుంది.

Also Read: Paytm Offer: పేటీఎం బెస్ట్ ఆఫర్, కేవలం రూ.10 చెల్లించి ఈ ప్రయోజనాలు పొందండి

ఇటీవల తీసుకొచ్చిన సందేశ్ యాప్‌లో మరో ముఖ్యమైన ఫీచర్ లాగౌట్ ఫీచర్ (Sandes Logout Feature). యాప్ నుంచి కొంతకాలం విరామం తీసుకోవాలంటే సందేశ్ యాప్ దీనిని సాధ్యం చేస్తుంది. అలాంటి ఫీచర్ తీసుకురావడానికి వాట్సాప్ కూడా సన్నాహాలు చేస్తోంది. కానీ ఇప్పటివరకూ వాట్సాప్ అయితే ఈ ఫీచర్ అందించలేకపోయింది. Also Read: SBI Latest News: ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త, ఒక్క ఫోన్ కాల్ ద్వారా PIN జనరేట్ చేసుకోవచ్చు 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link