Salman Khan: అది నిజమే.. సల్మాన్ ఖాన్‌తో పెళ్లి..వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింటయ్యాయి..ప్రముఖ క్రికెటర్ భార్య కామెంట్స్ వైరల్
salman khan sangeeta bijlani love story: 90వ దశకంలో సల్మాన్ ఖాన్‌ను చాక్లెట్ బాయ్ అని పిలిచేవారు. కండలవీరుడిని చూసి అమ్మాయిలు మనసుపారేసుకునేవారు. అంతేకాదు చాలా మంది నటీమణులతో సల్మాన్‌కు ఎఫైర్లు కూడా ఉన్నాయి.అందులో ఒకరిని పెళ్లి చేసుకోవాలని దాదాపు ఫిక్సయ్యాడు. పెళ్లి డేట్ కూడా ఖరారు అయ్యింది. కానీ చివరిక్షణంలో ఆగిపోయింది. ఆ నటి ఎవరో కదా సంగీత బిజ్లానీ. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే వెల్లడించారు.
సోనీ టీవీలో వచ్చే ప్రముఖ మ్యూజిక్ షో ఇండియన్ ఐడల్ 15వ సీజన్ నడుస్తోంది. శనివారం డిసెంబర్ 28వ తేదీ ప్రసారమైన ఎసిసోడ్ కు సంగీతా బిజ్లానీ చీఫ్ గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా మానసి ఘోస్ అనే కంటెస్టెంట్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. సల్మాన్ ఖాన్ తో పెళ్లికి వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ అయ్యాయి. అది వాస్తవమేనా అంటూ ఆమె ప్రశ్నించారు.
దీనికి సంగీతా స్పందించారు. ఇది అబద్దమైతే కాదు..ఇక చాలు..నా పేరు బిజిలానీ కానీ నాపై బిజిలీ ఎందుకు వేస్తున్నారు. బిజిలీ అంటే పిడుగు అని అర్థం. అని కామెడీ కూడా చేశారు. ఆ సమయంలోనే పక్కన ఉన్న జడ్జిగా ఉన్న మ్యూజిక్ డైరెక్ట్ విశాల్ దద్దానీ స్పందించారు. అసలు ఏం జరిగిందని అడిగారు.
ఈ విషయం తర్వాత చెబుతానంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేసింది సంగీత. అంతకుముందు మరో కంటెస్టెంట్ ఆమెను తన జీవితంలో జరిగిన వాటిలో ఏ విషయాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు.
దీనికి స్పందించిన సంగీత తన మాజీ తనను షార్ట్ డ్రెస్సులు వేసుకోనిచ్చేవాడు కాదని చెప్పుకొచ్చింది. ఆ మాజీ ఎవరని విశాల్ అడుగుతుంటే పేరు చెప్పును అన్నారు.
కాగా సంగీతా బిజ్లానీ ఓ మోడల్, బాలీవుడ్ హీరోయిన్. ఆమె సల్మాన్ ఖాత్ లో చాలా ఏళ్లపాటు డేటింగ్ కూడా చేశారు. వీళ్ల పెళ్లి జరగబోతున్నట్లు అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఆ పెళ్లి కాస్త క్యాన్సిల్ అయ్యింది. తర్వాత ఇద్దరూ విడిపోయారు. 10ఏళ్లపాటు వీళ్లు రిలేషన్ లో కొనసాగారు. 1996లో టీమిండియా మాజీ కెప్టెన్ అజార్దున్ ను సంగీత వివాహం చేసుకున్నారు
23ఏళ్ల పాటు సంతోషంగా కొనసాగిన వీరి బంధానికి 2019లో ముగింపు పలికారు. కాగా ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ తో క్లోజ్ గానే ఉంటోంది సంగీత. గతంలో ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ..పార్ట్ నర్స్ మధ్య ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదని..జీవితంలో ఎంతో మంది వస్తుంటారు..పోతుంటారు ఎవరూ శాశ్వతం కాదని సంగీత చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది.