Keerthy Suresh: పింక్ డ్రెస్‌లో హాట్ అండ్ బ్యూటీఫుల్‌గా కీర్తి సురేష్... ఫిదా అవుతున్న నెటిజన్లు
పింక్ కలర్ 'స్లిట్ కట్' డ్రెస్‌లో ఫోటోలకు పోజులిచ్చిన కీర్తి సురేష్... కీర్తిని పింక్‌లో చూశాక.. ఇంకెవరినీ ఆ డ్రెస్‌లో చూడబుద్ది కాదని... ఆ కలర్ ఆమెకు బాగా సూట్ అయిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
పింక్ డ్రెస్‌లో కీర్తి హాట్ అండ్ బ్యూటీఫుల్‌గా ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. కీర్తిని మించి అందమైన హీరోయిన్ మరెవరూ సినీ ఇండస్ట్రీలో లేరని ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం.
కీర్తి చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 2016లో వచ్చిన నేను శైలజ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
కీర్తి సురేష్ తక్కువ వ్యవధిలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'మహానటి' కీర్తి సురేష్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.
సర్కారు వారి పాటతో బ్లాక్ బ్లస్టర్ కొట్టిన కీర్తి సురేష్ ప్రస్తుతం చిరంజీవితో 'భోళా శంకర్', నానితో 'దసరా' మూవీలో నటిస్తోంది. ఇవిగాక తమిళం, మళయాలంలోనూ కొన్నిచిత్రాల్లో నటిస్తోంది. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది.