Saturn Transit 2023: శని ప్రభావంతో ఈ 4 రాశులకు నవంబర్ 4 నుంచి మహర్దశ, ఉద్యోగులు, వ్యాపారులకు వద్దంటే డబ్బు

Mon, 18 Sep 2023-5:51 am,

వృషభ రాశి

వృషభ రాశి జాతకులకు నవంబర్ 4 నుంచి అంతా శుభప్రదంగా ఉంటుంది. అంతులేని ధన సంపదలు వచ్చి పడతాయి. ఉద్యోగంలో మార్పు, జీతభత్యాలు పెరగడం ఉంటాయి. పనిచేసేచోట గౌరవ మర్యాదలు లభిస్తాయి.

శని గ్రహం ప్రస్తుతం కుంభ రాశిలోనే తిరోగమనంలో ఉంది. నవంబర్ 4వ తేదీన సక్రమ మార్గం పట్టనున్నాడు. శని కుంభ రాశిలో తిరోగమనంలో ఉండటం అనేది 30 ఏళ్ల తరువాత జరుగుతున్న సంయోగం. ఇందులో మార్పు రావడం కొన్ని రాశులకు అద్భుతంగా ఉండనుంది.

సింహ రాశి

శని సక్రమమార్గం కారణంగా సింహ రాశి జాతకుల ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. గతంలో ఎక్కడైనా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. కుటుంబ జీవితం, పెళ్లి జీవితం సుఖమయంగా ఉంటుంది. అంతులేని ధన సంపదలు లభిస్తాయి. 

మకర రాశి

మకర రాశి జాతకులకు శని గ్రహం కదలికలో మార్పు ప్రభావంతో  ఊహించని ధన లాభం ఉంటుంది. డబ్బులు సంపాదించేందుకు చాలా మార్గాలు తెర్చుకుంటాయి. జీవితంలో ఎదురౌతున్న సమస్యలు దూరమౌతాయి.

కుంభ రాశి

శని గ్రహం కుంభ రాశిలో ప్రవేశించడం వల్ల  నవంబర్ 4వ తేదీ నుంచి కుంభ రాశి జాతకులకు మహర్దశ పట్టనుంది. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి కలుగుతుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link