ATM Safety Tips: ఏటీఎం సేఫ్టీ టిప్స్ సూచించిన ఎస్‌బీఐ

Tue, 19 Jan 2021-11:08 am,

Safety Tips For Atm Users: భారతదేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారుల భద్రత కోసం కొన్ని విలువైన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. పాస్‌వర్డ్ విషయంతో పాటు ఏటీఎం కేంద్రంలో ఎలా వ్యవహరించాలి అని తమ వినియోగదారులకు State Bank Of India సూచనలు చేసింది. అయితే ఏటీఎం కార్డు వివరాలు గోప్యంగా ఉండేలా చూసుకుంటే, ఆన్‌లైన్ మోసాలతో పాటు పాస్‌వర్డ్ హ్యాకింగ్, కార్డ్ హ్యాకింగ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.

ఎస్‌బీఐ ఖాతాదారులు తమ పిన్ వివరాలు, కార్డు నెంబర్ ఇతరులకు చెప్పవద్దు. ఏటీఎం కార్డు వెనక ఉండే CVV నెంబర్ బహిర్గతం చేయకూడదు.

Also Read: Cheapest Recharge Plan: కేవలం రూ.2కే 1 GB డేటా, కాల్స్.. ప్లాన్ వివరాలు

మీ ఏటీఎం కార్డు పాస్‌వర్డ్ లేక పిన్ నెంబర్‌ను కార్డుపై రాసుకోవడం గానీ, పేపర్లపై రాసి కార్డుతో మాత్రం వెంట తీసుకెళ్లవద్దని ఎస్‌బీఐ సూచించింది.

ఏటీఎం కేంద్రంలో ఇతరులు చూడకుండా ఉండేలా నిల్చుని మీ పిన్ నెంబర్ టైప్ చేయాలి. అవసరమైతే మీ చేతిని అడ్డుపెట్టుకుని పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరి. 

Also Read: Lowest Interest Rate: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

మీకు లక్షల జాక్‌పాట్ వచ్చిందనో విలువైన బహుమతులు గెలిచారని ఫోన్, మెస్సేజ్, మెయిల్స్ వస్తే వాటికి స్పందించవద్దు. స్పందిస్తే మీ వివరాలు తెలుసుకుని డబ్బు ఆన్‌లైన్‌లోనే కాజేస్తారు.

ఏటీఎం కేంద్రంలో మీ ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక స్లిప్ వస్తే దాన్ని కచ్చితంగా మీతో తీసుకెళ్లండి. లేనిపక్షంలో స్లిప్‌ను చిన్న చిన్న ముక్కలుగా చింపి పడేయాలి. 

Also Read: SBI Credit Card Limit: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలని ఉందా.. ఇది చదవండి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link