SBI: హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి శుభవార్త, అప్పటివరకూ ఆ ఫీజు లేదు
భారతదేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) తన గృహ రుణాల్లో(Home Loans) 5 ట్రిలియన్ (5 లక్షల కోట్లు) మార్కును అధిగమించి మరో మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం 2024 నాటికి 7 ట్రిలియన్లు చేరడంపై బ్యాంక్ దృష్టి సారించింది. 7208933140కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా గృహ రుణాల వివరాలు పొందుతారు.
గృహ రుణాలపై బ్యాంక్ తక్కువ వడ్డీ రేటును ఎస్‌బీఐ అందిస్తోంది. 6.80 శాతం ఇంటి రుణాలు అందిస్తున్నందున మార్కెట్‌లో 34 శాతం వాటాను కలిగి ఉంది. రోజుకు 1000 మంది ఖాతాదారులు గృహ రుణాలు తీసుకుంటున్నారు. SBI ఆమోదించిన నిర్ణయాలలో గృహ రుణాలు పొందే వినియోగదారులకు మార్చి 2021 వరకు ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేసింది.
Also Read: SBI MF Retirement Benefit Scheme: మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ప్రారంభించిన SBI
రియల్ ఎస్టేట్ మరియు హౌసింగ్ బిజినెస్ విభాగాల్లో గత పదేళ్లలో 5 రెట్లు పెరిగి 2011లో రూ. 89000 AUMగా ఉన్న మొత్తం రూ.2021లో 5 ట్రిలియన్లకు చేరింది. కరోనా మహమ్మారితో రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. డిసెంబరు 2020లో గృహ రుణాలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన వృద్ధిని సాధించింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, బ్లాక్‌చెయిన్, మెషిన్ లెర్నింగ్‌ను తీసుకొచ్చి గృహ రుణాలతో పాటు ఇతర విభాగాల్లోనూ ఎస్‌బీఐ ముందుకెళ్తోంది. 215 కేంద్రాలలో సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్స్, బ్యాంక్ డిజిటల్ మరియు లైఫ్ స్టైల్ ప్లాట్‌ఫాం, YONO మరియు ఇతర యాప్‌ల సహకారంతో భారీగా రుణాలు అందిస్తోంది.
Also Read: ATM Safety Tips: ఏటీఎం సేఫ్టీ టిప్స్ సూచించిన ఎస్‌బీఐ
ప్రస్తుతం ఎస్‌బీఐ గృహ రుణాల మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. అతి తక్కువ డిఫాల్ట్ రేటును అందిస్తుంది. 2004లో ఎస్‌బీఐ గృహ రుణాల మొత్తం విలువ రూ. 17000 కోట్లు. ప్రత్యేక రియల్ ఎస్టేట్ మరియు హౌసింగ్ బిజినెస్ యూనిట్ (REHBU)తో 2012లో మార్కెట్‌ను విస్తరించింది. ఈ క్రమంలో 2014 ఆర్థిక సంవత్సరంలో గృహ రుణాలు అందించడంలో అగ్రస్థానంలో నిలిచింది.