SBI Recruitment 2020: భారీగా ఉద్యోగాలకు SBI నోటిఫికేషన్, పూర్తి వివరాలు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) భారీగా నియామకాలు చేపట్టింది. 8500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల కాలపరిమితికి అప్రెంటిస్ పోస్టులను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. తగిన అర్హతతో పాటు ఆసక్తి, అనుభవం ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 10 వరకు SBI వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
మొత్తం పోస్టులు 8500 కాగా, ఇందులో జనరల్ 3595, ఓబీసీ 1948, ఈడబ్ల్యూఎస్ 844, ఎస్సీ 1388, ఎస్టీ విభాగంలో 725 పోస్టుల చొప్పున ఖాళీలు ఉన్నాయి. తొలుత రాతపరీక్ష, అందులో ఉత్తీర్ణులైన వారికి లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులకు స్థానిక భాషలపై పట్టు ఉండాలి. టెన్త్ క్లాస్ లేదా ఇంటర్మీడియట్ వరకు స్థానిక లేదా మాతృ భాషలో చదివినట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించినవారికి లాంగ్వేజ్ టెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చారు.
దేశవ్యాప్తంగా 8500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, అందులో 1100 పోస్టులు తెలుగు రాష్ట్రాలకు కేటాయించారు. తెలంగాణలో 460 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్‌లో 620 ఖాళీలను ఎస్‌బీఐ భర్తీ చేయనుంది. అభ్యర్థులు కేవలం ఒక రాష్ట్రం నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Also Read : Twitter Blue Ticks: ట్విట్టర్‌లో బ్లూ టిక్ వీరికి మాత్రమే.. ఎవరికో తెలుసా?
జనరల్ అభ్యర్థులకు ఫీజు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 20న ప్రారంభమైన దరఖాస్తులు డిసెంబర్ 10న తుది గడువుతో ముగియనున్నాయి. పరీక్ష 2021లో నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు క్లిక్ చేయండి https://www.sbi.co.in/web/careers
అభ్యర్థులు 20 నుంచి 28 ఏళ్ల లోపువారై ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్ సమయంలో తొలి ఏడాది రూ.15 వేలు, రెండో ఏడాది రూ.16,500, మూడో ఏడాది రూ.19 వేలు స్టైఫండ్ చెల్లిస్తారు
Also Read : Oppo Price Cut on Smartphones: ఆకర్షణీయమైన ధరలకే ఒప్పో స్మార్ట్‌ఫోన్లు