SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు
ఎస్బీఐలో 2,000 ప్రొబేషనరీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. నవంబర్ 14వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఉంది.
ఎస్బీఐ ప్రకటించిన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. లేదంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. 2020 డిసెంబర్ 31 లోపు డిగ్రీ పాస్ అయ్యుండాలి. 2020 ఏప్రిల్ 4 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయస్సు ఉండాలి. వయస్సు మినహాయింపు విషయానికొస్తే.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎస్బీఐ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 4వ తేదీ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ కాగా 2020 డిసెంబర్ 31, 2021 జనవరి 2, 4, 5 తేదీల్లో ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.
ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టులకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు OC,EWS,OBC అభ్యర్థులకు రూ.750 కాగా SC,ST, PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తుల ప్రారంభం : నవంబర్ 14, 2020
దరఖాస్తులకు చివరితేదీ : డిసెంబర్ 4, 2020
పరీక్ష తేదీలు : 2020 డిసెంబర్ 31, 2021 జనవరి 2, 4, 5 తేదీలలో ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య: 2000 కాగా అందులో ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఎకనమికల్లీ వీకర్ సెక్షన్- 200, జనరల్- 810 భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం పోస్టుల సంఖ్య మారే అవకాశం ఉంది. Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఉండనుండగా ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి ఉన్నాయి.
Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
Also read : Use of firecrackers in Telangana: తెలంగాణలో టపాసుల విక్రయాలు, వినియోగంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు