Godavari Heroine: గోదావరి మూవీ సెకండ్ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఏం చేస్తుందో తెలుసా.?

Tue, 27 Aug 2024-7:36 pm,
Neetu Chandra

గోదావరి.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు చూసినా సరే చాలా ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. ముఖ్యంగా ఆ గోదావరి, ఆ హడావిడి నటీనటుల అద్భుతమైన ప్రదర్శన అన్నీ కూడా కళ్ళ ముందు తారసపడతాయి. ఈ చిత్రం ఎంత గొప్పగా ప్రేక్షకులను ఆకట్టుకుందంటే ఇందులో నటించిన నటీనటులు కూడా మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ దక్కించుకున్నారు. అలాంటి వారిలో ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన నీతూ చంద్ర కూడా ఒకరు.   

Neetu Chandra Movies

మొదటి సినిమాతోనే మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఈ సినిమా ద్వారానే బాగా పేరు సంపాదించుకుంది. ఈమె పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టరు కానీ గోదావరి సినిమాలో సుమంత్ మరదలు అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. తన అందం,  నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది నీతూ చంద్ర.  

2006లో మే 19వ తేదీన డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యూజికల్ సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. ఇందులో హీరోగా సుమంత్,  హీరోయిన్గా కమలిని ముఖర్జీ నటించారు. అంతేకాదు వీరిద్దరి కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇందులో సుమంత్ మరదలుగా రాజీ పాత్రలో కనిపించింది హీరోయిన్ నీతూ చంద్ర. ఈ సినిమాలో అల్లరి అమ్మాయిగా , అమాయకమైన మరదలుగా కనిపించి తెలుగు ఆడియన్స్ మనసుల్లో స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఈమె పెద్దగా కనిపించలేదు. దీంతో అభిమానులు ఏమైపోయింది? ఎక్కడుంది? అని ఆరా తీస్తున్నారు. 1984 జూన్ 20న  ఈమె బీహార్ లోని పాట్నా లో జన్మించింది. నటనపై ఆసక్తితో మోడలింగ్ వైపు అడుగులు వేసిన నీతూ,  ఆ తర్వాత 2003లో విష్ణువు అనే తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2005లో వచ్చిన గరం మసాలా సినిమాలో నటించిన ఈమె , ఆ తర్వాత గోదావరి సినిమాలో నటించి పాపులర్ అయింది. 2021లో చివరిసారి హాలీవుడ్ నెవర్ బ్యాక్ డౌన్ చిత్రంలో నటించింది  

2018లో ప్రో కబడ్డీ లీగ్ లో పాట్నా పైరేట్స్ కు కమ్యూనిటీ అంబాసిడర్ గా.. మారిన ఈమె ప్రస్తుతం వ్యాపారి రంగంలో బిజీగా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను,  వీడియోలను షేర్ చేస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link