Bank Holidays in September 2023: వచ్చే నెలలో 16 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదిగో..!
బ్యాంకు వినియోగదారులు సెలవుల తేదీని బట్టి ముందుగా ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకులకు సెలవులు ఉన్నా.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా పనులు చేసుకోవచ్చు.
సెప్టెంబరు 6, 7వ తేదీల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి, 28న ఈద్-ఇ-మిలాద్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్ కానున్నాయి.
సెప్టెంబర్ 3న ఆదివారం, సెప్టెంబర్ 9న రెండవ శనివారం, సెప్టెంబర్ 10న ఆదివారం, సెప్టెంబర్ 17 ఆదివారం, సెప్టెంబర్ 23న నాల్గో శనివారం, 24న ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
సెప్టెంబర్ 18 వర్సిద్ధి వినాయక వ్రతం, సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి, సెప్టెంబర్ 20 నుఖాయ్ (ఒడిశా), సెప్టెంబర్ 22 శ్రీ నారాయణ గురు సమాధి దివస్, 25న శ్రీమంత్ శంకర్‌దేవ్ పుట్టిన రోజు, సెప్టెంబర్ 27న మిలాద్-ఎ-షెరీఫ్, సెప్టెంబర్ 28న ఈద్-ఎ-మిలాద్ లేదా ఈద్-ఇ-మిలాదున్నబి, 29న ఇంద్రజాత్ర, శుక్రవారం ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (జమ్ము మరియు శ్రీనగర్) ప్రకారం ఆయా రాష్ట్రాల్లో సెలవులు ఉండనున్నాయి.