Sesame seeds in winter: చలికాలంలో ప్రతి రోజు ఒక స్పూను నువ్వులు తింటే చాలు.. బీపీ, షుగర్ సహా ఈ జబ్బులు తగ్గడం ఖాయం
Sesame seeds in winter: నువ్వులను డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా నువ్వుల్లోని పోషకాల గురించి అందరికీ తెలిసిందే. నువ్వులను భారతీయ వంటకాల్లో పలు రకాలుగా ఉపయోగిస్తారు. నువ్వులు వేడి స్వభావం కలిగి ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో వీటిని ఎక్కువగా తీసుకుంటారు. భారతీయులు నువ్వుల గింజలను ప్రత్యేకంగా ఆహారంలో చేర్చుకుంటారు.
నువ్వుల్లోని వేడి స్వభావం కారణంగా నువ్వులు మన శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతాయి. వీటిలో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని సూపర్ ఫుడ్ అంటారు. చలికాలంలో నువ్వు తింటే కలిగే లాభాలేంటో చూద్దాం.
నువ్వుల గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. అంతేకాదు గుండెపోటు వంటి సమస్యలను తగ్గిస్తాయి.
నువ్వులు బ్లడ్ షుగర్ పేషంట్లకు మేలు చేస్తాయి. ఇందులో ఉండే ప్రొటీన్, ఫైబర్ బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి. వీటిని తింటే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ఒక్కసారిగా పెరగవు. నువ్వుల్లో ఎక్కువ మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది. డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి.
నువ్వులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం , జింక్ అధిక మోతాదులో ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి. అంతేకాదు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారికి నువ్వులు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి తింటే కడుపు నిండుగా ఉంటుంది. బరువు తగ్గడంలో కూడా సహాయం చేస్తాయి.
నువ్వుల నూనె చర్మానికి, జుట్టుకు మేలు చేస్తుంది. చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టును వేగంగా పెరిగేలా చేస్తుంది. అంతేకాదు చుండ్రు సమస్యకు చెక్ పెడుతుంది.