Shadashtak Yog Effect: డిసెంబర్ 7నే షడష్టక యోగం.. ఈ రాశులవారు మహర్జాతకులు, జాక్‌పాట్ కొట్టారు.. డబ్బే, డబ్బు!
గ్రహాలన్నింటిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శని, కర్మలకు అధిపతిగా వ్యవహరించే అంగారక గ్రహం కలయికల కారణంగా షడష్టక యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. ఇది ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
ఎంతో శక్తివంతమైన షడష్టక యోగం డిసెంబర్ 7న ఏర్పడబోతోంది. అయితే ఇది మరోలా కూడా ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరి వరకు కుజుడు కర్కాటక రాశిలో తిరోగమనం దశలో తిరుగుతూ ఉంటాడు. దీని కారణంగా పరస్పరం కుజుడు, శని జాతాకాల్లో 6వ స్థానం, 8వ స్థానాల్లో ఉండబోతున్నాడు. దీని వల్ల షడష్టక యోగం ఏర్పడబోతోంది.
ఈ షడష్టక యోగం కారణంగా మేష రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీని కారణంగా ఈ వారికి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. అలాగే వృత్తి జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి ఊహించని స్థాయిలో డబ్బు సంపాదిస్తారు.
అలాగే మేష రాశువారు ఈ యోగం కారణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి సంపదన కూడా పెరుగుతుంది. ప్రేమ జీవితంలో సమస్యలు తొగిపోతాయి. అలాగే వీరి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
తులా రాశి ఈ ప్రత్యేకమైన యోగం ఏర్పడడం వల్ల గోల్డెన్ టైమ్ ప్రారంభమవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే డిసెంబర్ 7వ తేది నుంచి జీవితం చాలా బాగుంటుంది. దీంతో పాటు కొత్త కొత్త పనులు చేయడం వల్ల సులభంగా విజయాలు సాధిస్తారు.
తులారాశి వారు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సమస్యలు పూర్తిగా తొలగిపోయి.. డబ్బులు కూడా విపరీతంగా పొందుతారు. దీంతో పాటు పెళ్లికాని వారు ఆక్రమ సంబంధాల విషయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలాగే కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది.
శని అధిపతిగా వ్యవహరించే కుంభ రాశివారికి కూడా షడష్టక యోగం ఏర్పడడం వల్ల విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కెరీర్ పరంగా వీరు ఊహించని విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాలు కూడా చాలా వరకు మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి.
కుంభ రాశివారికి ఈ షడష్టక యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగాలు చేసేవారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వీరికి కుటుంబ సభ్యుల సపోర్ట్ లభించి కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
(నోట్: ఇక్కడ మేము అందించిన సమాచారం సాధారణ నమ్మకం, వాస్తవాలపై ఆధారపడి ఉంటుందని తెలియజేస్తున్నాము. ఈ స్టోరీకి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు.)