Shani Gochar: నవంబర్ 15 తర్వాత ఈ రాశుల వారిపై శని దేవుడి అపార కరుణా కటాక్షాలు.. కష్టాలకు చెల్లుచీటీ..
Shani Gochar: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..శని దేవుడు నెమ్మదిగా సంచరిస్తూ ఉంటాడు. అందుకే శనిదేవుడిని మందుడు అని.. మందగమనుడు అని పిలుస్తుంటారు. శని గమనంలో వచ్చే మార్పు మొత్తం 12 రాశులను తీవ్ర ప్రభావితం చేస్తుంది. కొందరికి ఈ ప్రభావం శుభప్రదంగా ఉంటుంది. మరికొందరికి అశుభంగా పరిగణిస్తారు. ప్రస్తుతం వక్ర మార్గంలో ప్రయాణిస్తూ నవంబర్ 15న ఋజు మార్గంలో ప్రయాణించనున్నారు. ఇలా చేయడం వలన ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి.
కుంభ రాశి..
శని కుంభరాశిలోకి తిరిగి ప్రవేశించడం వలన ఈ రాశి వారు గత కొంత కాలంగా అనుభవిస్తున్న కష్టాలు దూరమవుతాయి. అంతేకాదు అనవసరంగా ఎలాంటి ఖర్చులు పెట్టకుండా పొదుపు పాటించండి. ఏదైనా ఓ పని చేయాలనుకున్నపుడు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తే బెటర్. వివాహా జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఇతరులతో అస్సలు వాదనలకు దిగకండి. పొదుపుగా ఉంటే మీ భవిష్యత్తు ఉజ్వల్లంగా ఉంటుంది.
మీన రాశి.. మీన రాశి వారికీ శని దేవుడి రాశి మార్పు వలన కొన్ని విషయాల్లో అవమానాలు ఎదుర్కుంటారు. అవి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయలేవు. ఆర్ధిక సమస్యల కారణంగా కొన్ని అంశాలకు దూరంగా ఉంటే బెటర్. విద్యార్ధుల చదువు పట్ల శ్రద్ధ వహించాలి. పొరపాటున కూడా పెదరాయుడిలా ఎలాంటి మధ్యవర్తిత్వం వహించకండి. మొదటికే మోసం వస్తోంది. గొడవలకు దూరంగా ఉంటే బెటర్. శని వారం రోజున శనీశ్వరుడి స్త్రోత్రంతో మీకు ఆరోగ్యం చూకూరుతుంది.
కర్కాటక రాశి. శని రాశి మార్పు వలన కర్కాటక రాశి వారికీ ఉన్న ఇబ్బందికర పరిస్థితులు తొలిగిపోతాయి. మానసిక సమస్యలు కొన్ని రోజులు వెంటాడుతాయి. ఫిబ్రవరి తర్వాత అంతా సెట్ అవుతోంది. ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయంలో ఎదుటివారితో ఎలాంటి గొడవలు దిగకండి.
మకర రాశి.. మకర రాశి వారు మరికొన్ని రోజుల్లో అన్ని కష్టాల నుంచి విముక్తి పొందుతారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి వరకు కొన్ని ఇబ్బంది కర పరిస్థితులను ఎదుర్కొవలసి రావచ్చు. కోర్టు కేసులు చికాకు పెడతాయి. జీవిత భాగస్వామితో ఆచితూచి వ్యవహరించండి. గొడవలకు దిగకుండా ఉంటే ఎంతో బెటర్.
గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ZEE NEWS ఈ వార్తను ధృవీకరించడం లేదు.