Shani Effect: శనిదోషం అస్సలు వద్దనుకుంటున్నారా..?.. ఈ పనులను పొరపాటున కూడా చేయోద్దు..
చాలా మంది శనీ ప్రభావం వల్ల మాకు చెడు కల్గుతుందని భావిస్తుంటారు. కానీ శనీదేవుడు మాత్రం మనం చేసుకున్న కర్మలను బట్టి తగిన పనిష్మెంట్ ఇస్తుంటాడు.
ద్వాదశ రాశులలో శని దేవుడు సంచారం చేస్తు ఉంటాడు. శనీ ప్రభావం ఎలా ఉంటుందంటే..ఆయన అనుగ్రహిస్తే పెదవాడు రాజ్యమేలే రాజవుతాడు. ఆగ్రహిస్తు రాజు కాస్తు.. గుడి ముందు కూర్చుని యాచకునిలా మారాతాడు.
కానీ శనీ ప్రభావం అనేది మనం చేసుకున్న పాపు, పుణ్యాల కర్మలను బట్టి ఉంటుంది. కొంతమంది మాత్రం కొన్నిపనులు చెడ్డవి అని వాళ్లకు తెలిసిన కూడా మానుకోరు.
ఇలాంటి వాళ్లకు శనీదేవుడు అదే విధంగా పనిష్మెంట్ ఇస్తాడు. కానీ ఎంత చెడుపరిస్థితులు కల్గిన.. న్యాయంగా ఉంటూ, మన పనిని మనం చేసుకునే వాళ్లకు, పక్కవాళ్ల కీడును కోరుకుని వాళ్లకు శనీ దేవుడు ఎప్పటికి అపకారం తలపెట్టడని పండితులు చెబుతుంటారు.
ఇతరులకు ఆపద, కష్టాలు తలపెట్టి పైశాచీక ఆనందం పొందేవారికి మాత్రం శనీదేవుడు వాళ్ల జీవితంలో ఎలాంటి ఎదుటు బొదుగు లేకుండా చేస్తాడంట. అందుకే పక్క వాడికి వీలైతే ఏదైన సహాయం చేయాలి లేదా మన పని మనం చూసుకొవాలి.
శనీదోష నివారణకు 11 శనివారాలు శనీ ఆలయంకు వెళ్లి తైలాభిషేకం, నల్లనువ్వులతో శనీకి అభిషేకం చేయించుకొవాలి. నల్లని వస్త్రంను దానంగా ఇవ్వాలి. నల్లచీమలకు చక్కెర, శునకాలకు చపాతీలు, కాకులకు అన్నం ఇలా పెడితే.. శనీదోషం నుంచి ఈజీగా బైటపడొచ్చు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)