Share Market: పుంజుకున్న మార్కెట్, గ్రీన్ కలర్‌తో క్లోజ్ అయిన సెన్సెక్స్, నిఫ్టీలు
ఇవాళ నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో అదానీ పోర్ట్స్, ఐచర్ మోటార్స్, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఉన్నాయి. టాప్ లూజర్స్‌లో టీసీఎస్, ఓఎన్జీసీ, ఇన్‌ఫోసిస్, సన్ ఫార్మా, టాటా మోటార్స్ ఉన్నాయి.
షేర్ మార్కెట్ ఇవాళ వేగంగా పుంజుకోవడంతో ఇన్వెస్టర్లకు ఉపశమనం కలుగుతోంది. సెన్సెక్స్ గత వారం 61,337.81 పాయింట్లకు క్లోజ్ అయింది. అయితే ఇవాళ మాత్రం 61,405తో ప్రారంభమై.. 61,800 వద్ద క్లోజ్ అయింది. ఇవాళ గరిష్టంగా 61844 కు చేరుకుంది.
గత వారం మార్కెట్‌లో క్షీణత కన్పించింది. కానీ ఇప్పుడు వారం ప్రారంభం మాత్రం గ్రీన్ మార్క్‌తో క్లోజ్ కావడం విశేషం. సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ మంచి వృద్ధి నమోదు చేశాయి. సెన్సెక్ 61,800, నిఫ్టీ 18,500 వద్ద క్లోజ్ అయ్యాయి.
ఐటీ రంగం మినహాయించి.. ఆటో, ఎఫ్ఎంసీజీ సూచీలో లాభాలు కన్పించాయి. ఇతర అన్ని రంగాల్లో కూడా గ్రీన్ మార్క్ కన్పించింది. డిసెంబర్ 21న జరగనున్న ఆర్బీఐ ఎంపీసీ భేటీపై అందరి దృష్టీ ఉంది.
అటు నిఫ్టీ కూడా ఇవాళ గ్రీన్ మార్క్‌లో కన్పించింది. నిఫ్టీ గత వారం 18,269కు క్లోజ్ అయింది. కానీ ఇవాళ నిఫ్టీ పుంజుకుని 18,288 తో ప్రారంభమై...18,400 వద్ద క్లోజ్ అయింది.