Manmadha Re Release: రీ రిలీజ్ లో కూడా వసూళ్లు దుమ్ము దులుపుతున్న శింబు ‘మన్మథ’.. ఇదెక్కడి మాస్ రచ్చరా మావ..!

Sun, 06 Oct 2024-8:53 pm,

Manmadha Re Release: ఎస్.జే.మురుగన్ దర్శకత్వంలో శింబు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అప్పట్లో ఈ సినిమా రొమాంటిక్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరించింది.

తాజాగా ఈ సినిమాను సాయి సుధా రాజకొండ, అజిత్ సింగ్, వేమూరి శ్రేయస్, రమణ ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా ఈ నెల 5న మళ్లీ విడుదల చేసారు. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఎన్టీఆర్ ‘దేవర’తో పాటు పలు కొత్త చిత్రాలు విడుదలైన గట్టి పోటీ మధ్య ‘మన్మథ’ సినిమా తన ఉనికిని చాటుకుంది. ఈ సినిమా సింధు తులాని, మందిరా బేడి, యానా గుప్త, అతుల్ కులకర్ని, అర్జు గోవిత్రిక లీడ్ రూల్స్ లో యాక్ట్ చేశారు.

గత కొన్నేళ్లుగా రీ రిలీజ్ లకు ఉన్న ట్రెండ్ నేపథ్యంలో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం మళ్లీ విడుదలైవుతున్న సినిమాలకు ధీటుగా  రీ రిలీజ్ సినిమాలు కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నాయి. అదే కోవలో ఈనెల 5న రీ రిలీజ్ అయిన ‘మన్మథ’  సినిమా కలెక్షన్లతో దుమ్ము దులుపుతోంది.

శింబు, జ్యోతిక జోడికి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నాయి.  యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఇప్పటికి కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి. మొత్తంగా దసరా కానుకగా రీ రిలీజైన ఈ సినిమా మొత్తంగా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link