Shiva Favourite Zodiac Signs: శివునికి ఎంతో ఇష్టమైన రాశులు ఇవే.. వీరికి ఎల్లప్పుడూ డబ్బే డబ్బు..

Mon, 15 Jul 2024-8:52 pm,

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులకు శివుడికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకే కొన్ని రాశులను శివుడికి ఇష్టమైన రాశులుగా భావిస్తారు. ఈ రాశుల వారు ఎలాంటి సమస్యల్లో ఉన్న శివుడు రక్షిస్తాడని జ్యోతిష్యులు చెబుతున్నారు.

అలాగే శ్రావణమాసంలో శివుడికి ఎంతో ఇష్టమైన కొన్ని రాశుల వారు ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే శివుడికి ఇష్టమైన రాశులేంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.   

శివుడికి ఎంతో ఇష్టమైన రాశుల్లో మకర రాశి ఒకటి. అందుకే మకర రాశికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రాశి వారు శ్రావణమాసంలో శివుడికి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

అలాగే మకర రాశి వారికి శివుడి అనుగ్రహం లభించి ఎలాంటి పనుల్లోనైనా సులభంగా విజయాలు సాధించే శక్తిని పొందుతారు. శ్రావణమాసంలో ఈ రాశి వారు తప్పకుండా ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది.   

మేష రాశి వారికి శివుడి అనుగ్రహం వల్ల ఎలాంటి సమస్యలైనా పూర్తిగా పరిష్కారం అవుతాయి.  దీంతోపాటు ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న వారికి శివుడి ప్రత్యేకమైన ఆశీస్సులు లభించి సమస్యలన్నీ తొలగిపోతాయి.    

అలాగే మేష రాశి వారు శివుడికి శ్రావణమాసం గంగాజలం తో అభిషేకం చేయడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కెరీర్ కు సంబంధించిన విషయంలో కూడా పురోగతి లభిస్తుంది. అలాగే పెద్ద పెద్ద సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివునికి అత్యంత ప్రీతికరమైన రాశుల్లో కుంభరాశి ఒకటి. ఈ రాశి వారికి కూడా శివుడి అనుగ్రహం లభించి జీవితంలో ఆనందంతోపాటు డబ్బును పొందుతారు. అంతేకాకుండా అనుకున్న పనులన్నీ ఎంతో సులభంగా చేయగలుగుతారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link