Lady Aghori: ఇదేం ట్విస్ట్.. ఆమె అఘోరీ కాదు.. ట్రాన్స్ జెండర్..?.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..

Mon, 21 Oct 2024-6:14 pm,

తెలంగాణలో సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్ని నీచంగా ప్రవర్తించాడు. అంతే కాకుండా.. అమ్మవారి ఆలయంలో నానా బీభత్సం చేశాడు.

ఈ ఘటన తెలంగాణలో పెనుదుమారంగా మారింది. హిందు సంఘాలు దీనిపై భగ్గుమన్నాయి. దీనిపై ఇటీవల సికింద్రాబాద్ వ్యాప్తంగా బంద్ కూడా నిర్వహించారు. అక్కడ అనేక గొడవలు చోటు చేసుకున్నాయి

మరోవైపు ముత్యాలమ్మ ఘటన తర్వాత అఘోరీ మాత ఆలయానికి వచ్చారు. అక్కడ ప్రత్యేకంగా పూజలు చేశారు. గతంలో అఘోరీ మాత వేముల వాడ రాజన్న, కొముర వెల్లి , కీసర ఆలయంలో సైతం కూడా వెళ్లి పూజలు చేశారు. 

తెలంగాణలో అఘెరీ మాత నగ్నంగా తిరుగుతూ హిందు సమాజం గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. పరధర్మంను గౌరవిస్తునే, మన ధర్మంను కాపాడుకొవాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా.. ఎక్కడ ఏదైన ఇలాంటి ఘటనలు జరిగితే బైటకు వచ్చి నిరసనలు చెప్పాలని కూడా పిలుపు నిచ్చారు.

తను ఏడేళ్ల వయస్సులో ఉన్నప్పుడు.. అఘోరీగా మారాలని అనుకుని , కాశీకి వెళ్లిపోయినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఏన్నో ఏళ్ల పాటు కఠినంగా ఉండి.. అనేక శక్తుల్ని గురువు నుంచి పొందినట్లు చెప్పారు. లోక కల్యాణం కోసం మాత్రమే తాము బైటికొచ్చినట్లు, పంచభూతాలు తమ ఆధీనంలో ఉంటాయని ఆమె చెప్పారు.

మరోవైపు లేడీ అఘోరీ తమకు కూడా పీరియడ్స్ వస్తాయని, ఆ టైమ్ లో గుడిలో ఉంటామని చెప్పారు. తెలంగాలో ప్రళయం రాబోతుందని కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా..అఘోరీలు ఎంతో నిష్టతో దైవీక శక్తులతో ఉంటారని చెప్పుకొచ్చారు. 

అయితే.. కొంత మంది మాత్రం ఆమె అసలు అఘోరీ కాదని కేవలం ఒక ట్రాన్స్ జెండర్ అని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకైతే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ అఘోరీ మాత మాత్రం తెలంగాణలో మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారారని చెప్పుకొవచ్చు.

కానీ మరికొందరు మాత్రం.. కొంత మంది అఘోరీకి వస్తున్న పాపులారీటీ చూసి ఓర్వలేక ఇలాంటి ఫెక్ రూమర్స్ వైరల్ చేస్తున్నారన్నారు. అదే విధంగా అఘోరీ కారు ఉపయోగించడటం, ఐఫోన్ వినియోగించడం కూడా వార్తలలో నిలిచిన విషయం తెలిసిందే.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link