Shraddha Das: సూర్య ‘కంగువా’ కోసం శ్రద్ధా దాస్ అంత పనిచేసిందా..
యాక్ట్రెస్ గా శ్రద్ధా దాస్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈమె సూర్య హీరోగా నటించిన ‘కంగువా’ మూవీ కోసం సింగర్ అవతారం ఎత్తింది. అంతేకాదు ఏకంగా దేవీశ్రీ ప్రసాద్.. శ్రద్ధా దాస్ ను గాయనిగా పరిచయం చేస్తున్నారు.
సూర్య హీరోగా దిశా పటానీ హీరోయిన్ గా శివ దర్శకత్వంలో తెరకెక్కిన ప్యాన్ ఇండియా చిత్రం కంగువాలో శ్రద్దా దాస్ ఓ పెప్పీ సాంగ్ ను ఆలపించింది. సినిమాలో ఈ సాంగ్ ప్రేక్షకులను అలరించడం పక్కా అని చెప్పొచ్చు.
శ్రద్దా దాస్ .. పాడిన ఈ పాట ఇపుడు ఛార్ట్ బస్టర్స్ లో టాప్ లో నిలవడం పక్కా అని చెబుతున్నారు. ఇక సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విషయానికొస్తే.. ఈ చిత్రంలో బాబీ దేవోల్ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో ఈ నెల 14న రిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే కంగువా సినిమా పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కంగువా నుంచి వచ్చిన యోలో పాట అందరినీ అలరిస్తోంది. యూట్యూబ్‌లో ఇప్పటికే మిలియన్ల కొద్ది వ్యూస్ సంపాదించింది. దేవి శ్రీ ప్రసాద్, శ్రద్ధా దాస్, సాగర్ గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. తెలుగులో రాకేందు మౌళి సాహిత్యం అందించారు.
యోలో పాటలోని శ్రద్ధా దాస్ గాత్రం ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ఇదిలా ఉంటే, రీసెంట్ గా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన మ్యూజికల్ ఈవెంట్‌లో రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి శ్రద్ధాదాస్ సాంగ్స్ పాడి ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
మరి రాబోయే రోజుల్లో శ్రద్దా దాస్.. నటిగా కొనసాగుతూనే పూర్తి స్థాయి సింగర్ గా అలరిస్తుందా లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా శ్రద్దా దాస్ లోని ఈ టాలెంట్ ను గుర్తించిన దేవీశ్రీ ప్రసాద్ ను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.