Sravana Masam 2024: శ్రావణ సోమవారం శివుడిని ఇలా పూజించారంటే..ఆర్థిక సమస్యలు తొలగి..ఐశ్వర్యం మీ ఇంట్లోనే..!!

Sun, 04 Aug 2024-6:57 pm,

Sravana Somavaram 2024: ఆగస్టు 5, 2024 నుంచి శ్రావణ మాసం శ్రావణ సోమవారంతో ప్రారంభం అవుతుంది. ఈ మాసం అంతాకూడా పూజలు, వ్రతాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలతో బిజీగా గడుపుతుంటారు.  హిందువుల ప్రతిఇంట్లో ఏదొక పూజ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏడాది శ్రావణమాసం సోమవారం నుంచి ప్రారంభం అవుతుండటంతో శివాలయాలు భక్తులతో రద్దీగా మారుతాయి. ఆలయాలన్నీ భక్తుల కోలాహలంతో కళకళలాడుతుంటాయి. ఇక మహిళలు అయితే వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతాలు చేస్తుంటారు. అంతేకాదు ఆ పరమశివుడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ ఏడాది శ్రావణ మాసంలో మొత్తం 5 సోమవారాలు వచ్చాయి. దీనికి ముందే చాతుర్మాసం ప్రారంభం అయ్యింది. ఇది 4 నెలలు పాటు ఉంటుంది. శ్రావణమాసంలో శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి పరిహారాలు పాటించాలి. శివుడికి ఎలాంటి పూజలు నిర్వహించాలి. ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు భోలాశంకరుడికి ఎలాంటి పూజలు చేస్తే పరిష్కారం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

పరమశివుడి అనుగ్రహం కోసం:శ్రావణమాసంలో సోమవారం రోజు బిల్వపత్రాలతో శివుడికి నీళ్లను సమర్పించాలి.నీళ్లను సమర్పించిన పత్రాలను మీ దగ్గర రోజంతా ఉంచుకోవాలి. సాయంత్రం  ఏదైనా చెట్టు దగ్గర ఆ పత్రాలను వదిలిపెట్టాలి. ఇలా చేయడం వల్ల మీరు ఒంటరిగా ఉన్నారన్న ఆలోచనల నుంచి బయటకు వస్తారు.  అంతేకాదు ఈ మాసంలో మట్టితో శివుడిని తయారు చేసి..దానిపై కుంకుమ, పసుపుతో పూజలు చేస్తే మీ వివాహ జీవితంలో ఏర్పడ్డ సమస్యలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 

ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు:శ్రావణమాసంలో ఏదొక రోజు రాత్రి శివలింగం దగ్గర దీపం వెలిగించి..చెరుకు రసంతో శివలింగాని అభిషేకం చేయాలని వేదపండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. డబ్బు చేతికి అందుతుంది. అంతకాదు మీ ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది.   

శ్రావణ సోమవారాల్లో ఇలా చేయండి: శ్రావణమాసంలోని అన్ని రోజులూ పవిత్రమైనవే. పరమేశ్వరుడికి ప్రీతికరమైన ఈ మాసంలో ఆయనకు ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. అయితే పూజ చేసే వారందరూ కూడా ఉపవాసం ఉండాలి. అప్పుడే మీరు కోరిక కోరికలన్నీ నెరవేరుతాయి. తొలి శ్రావణ సోమవారం 5 ఆగస్టు 2024, రెండో శ్రావణ సోమవారం నాడు 12 ఆగస్టు 2024, మూడో శ్రావణ సోమవారం నాడు 19 ఆగస్టు 2024 ,నాలుగో శ్రావణ సోమవారం నాడు 26 ఆగస్టు 2024 ,ఐదో శ్రావణ సోమవారం నాడు 02 సెప్టెంబర్ 2024..ఈ ఐదు సోమవారాలు తప్పుకుండా ఉపవాసం ఉండండి.   

బిల్వ మొక్క నాటండి: ఆ మహాదేవుడి అనుగ్రహం పొందాలంటే మీరు శ్రావణమాసంలో మీ ఇంట్ల బిల్వ మొక్కను నాటండి. దీన్ని బిల్వ వ్రుక్షం అని కూడా పిలుస్తారు. ఈ మొక్క శివుడికి ఎంతో ప్రీతకరమైంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో బిల్వ మొక్కనాటితే అంతా శుభప్రదమని చెబుతోంది. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link