Shriya : 20 లోనే ఆగిపోయిన శ్రియ.. నల్ల చీరలో ఇష్టం మరింత పెంచుతున్న హీరోయిన్

Sun, 26 Nov 2023-2:09 pm,

Shriya in black saree: ఇష్టం సినిమాతో మనకు పరిచయమై ఆ తర్వాత వచ్చిన సంతోషం.. నువ్వే నువ్వే చిత్రాలతో చెరిగిపోని ముద్ర వేసుకున్న నటి శ్రియ..  

ముఖ్యంగా నువ్వే నువ్వే సినిమాలో తాను చేసిన అంజలి పాత్ర మనకి ఇప్పటికీ గుర్తుండి. ఇక ఆ చిత్రంలో నా మనసుకేమయింది పాటలో ఒక బ్లూ రంగు చీరలో కనిపించి మన మనసులు దోచింది.

అయితే అప్పుడు ఆ చీరలో ఎలాగైతే ఉందో ప్రస్తుతం శ్రీయ నల్ల చీరలో తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలలో కూడా అచ్చం అలానే ఉంది.  

నమ్మకపోతే ఒకసారి ఈ ఫోటోలు చూసేయండి.. శ్రియ సినిమా ఇండస్ట్రీ కి వచ్చి 23 సంవత్సరాలు కావస్తున్న తన వయసు మాత్రం తన మొదటి సినిమా ఇష్టం దగ్గరే ఆగిపోయింది.

ఇప్పుడున్న హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని ఈ చందమామ త్వరలో మళ్లీ హీరోయిన్ గానే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link