Shriya Saran: చీరకట్టులో శ్రియా శరన్ అందాల జాతర.. ఓ బిడ్డకు తల్లైనా ఎక్కడా తగ్గడం లేదుగా..
కథానాయికల్లో శ్రియ స్టైల్ వేరు. అందరికీ వయసుతో పాటు అందం తగ్గిపోతూ ఉంటుంది. కానీ శ్రియ మాత్రం గ్లామర్ విషయంలో రోజు రోజుకు ఆమె అందం పెరుగుతూ ఉంది.
ఏజ్ 40 దాటినా.. ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటికీ అదే సోయగంతో అలరించడం అంటే మాములు విషయం కాదు.
ఓ వైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అదే రీతిలో ఘాటు ఫోజులతో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది.
సామాజిక మాధ్యమాల్లో బాగా యాక్టివ్‌గా ఉండే శ్రియ..ఎప్పటికపుడు తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.
తెలుగులో బడా స్టార్ హీరోలు, యంగ్ స్టార్ హీరోలు అనే తేడా లేకుండా అందరి కథానాయకలతో రొమాన్స్ చేసిన ఘనత శ్రియకు దక్కుతుంది.
సినిమాల్లో యాక్ట్ చేస్తూనే 2018లో ఆండ్రీ కోస్చీవ్‌ని వివాహాం చేసుకుంది. అంతేకాదు పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం బడా హీరో సినిమాల్లో ఈమె బెస్ట్ ఆప్షన్‌లా మారింది.