Shruti Haasan: బ్లాక్ చీరతో మదిలో మంటలు రేపుతున్న శృతిహాసన్..!
సిద్ధార్థ హీరోగా వచ్చిన అనగనగా ఒక ధీరుతో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శృతిహాసన్. ఆ తరువాత సిద్ధార్థ తోనే ఓ మై ఫ్రెండ్ చిత్రంలో కనిపించింది.
అయితే శృతిహాసన్ కెరియర్ తెలుగులో.. మొదట్లో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ తెచ్చిపెట్టలేదు. కమల్ హాసన్ కూతురిగా అడుగుపెట్టినప్పటికీ.. ఆమెకు వరసగా ఫ్లాపులు రావడంతో.. ఇక శృతిహాసన్ పని అయిపోయినట్టే అనుకున్నారు అందరూ.
కానీ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా శృతిహాసన్ ఫేట్ మొత్తం మార్చేసింది. ఈ చిత్రం ఎంతో కాలం నుంచి విజయం ఎదురుచూస్తున్న.. పవన్ కళ్యాణ్ కి, శృతిహాసన్ కి బ్లాక్ బస్టర్ అందించింది. ఇక అప్పటినుంచి ఈ హీరోయిన్ కి వరుస హిట్లు రావడం మొదలయ్యాయి.
తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలో కూడా పలు సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. తన పర్సనల్ విషయాల ద్వారా కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది శృతిహాసన్.
తాజాగా శృతిహాసన్ ఇంస్టాగ్రామ్ తన పోస్టుల వల్ల తెగ ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా శృతిహాసన్ బ్లాక్ రంగు చీరలో.. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.