Shruti Haasan: చాక్లెట్ రంగులో శృతిహాసన్…ఫిదా అవుతున్న అభిమానులు

Mon, 08 Apr 2024-6:51 pm,

అనగనగా ఒక ధీరుదు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శృతిహాసన్. ఆ తరువాత సిద్ధార్థ ఓ మై ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య లాంటి సినిమాలలో కనిపించింది.

అయితే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత నుంచి శృతిహాసన్ స్టార్ స్టేటస్ మారిపోయింది. అప్పటివరకు ఐరన్ లాగా పేరు పొందిన ఆమె గబ్బర్ సింగ్ సినిమా దగ్గర నుంచి గోల్డెన్ లెగ్ అయిపోయింది.

ఫ్లాపుల్లో ఉన్న హీరోలు శృతిహాసన్ తో నటిస్తే చాలు సూపర్ హిట్ వస్తుంది అన్నట్టు.. ఆమె క్రాక్, వాల్తేరు వీరయ్య, సలార్ సినిమాలు రుజువు చేశాయి.

అంతేకాకుండా ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, సలార్ సినిమాలతో హ్యాట్రిక్ కూడా అందుకుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం సలార్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.

ఈ క్రమంలో శృతిహాసన్ షేర్ చేసిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతున్నాయి. చాక్లెట్ రంగు చీరలో మెరిసిపోతూ ఎంతో అందంగా కనిపించింది ఈ నటి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link