Shukra And Shani Combination: శక్ర, శని గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశులవారికి సువర్ణ యోగంతో మహర్దశ పట్టబోతోంది!

Sun, 22 Sep 2024-11:29 am,

శుక్రుడు కుంభరాశిలోకి డిసెంబర్ 28వ తేదీన ప్రవేశించబోతున్నాడు. అయితే ఇప్పటికే శనిగ్రహం కుంభరాశిలో సంచార దశలో ఉంది. దీంతో ఈ రెండు గ్రహాల అరుదైన కలయిక జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ అరుదైన కలయిక ప్రభావంతో కొన్ని రాశుల వారికి వృత్తి వ్యాపారాలు ఆర్థిక పరంగా జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి.   

డిసెంబర్ 28వ తేదీ నుంచి వృషభ రాశి వారికి సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. దీని కారణంగా పోటీ పరీక్షల్లో ఊహించని ర్యాంకులు సాధించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్థికపరంగా వృషభ రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది.   

వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా కోర్టు కేసుల్లో ఇరుక్కున్న వారికి విముక్తి కూడా లభిస్తుంది. వీరికి ఈ సమయంలో విపరీతమైన అదృష్టం పెరగడం కారణంగా ఎలాంటి పనులైన ఎంతో తొందరగా చేయగలుగుతారు.   

తులా రాశి వారికి కూడా ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కుటుంబ జీవితంలో అనేక సమస్యల నుంచి విముక్తి లభించబోతోంది. అంతేకాకుండా వీరికి ఉద్యోగాల్లో పదోన్నతులు కూడా లభిస్తాయి. అలాగే బాస్ నుంచి సపోర్టు లభించి.. మంచి మంచి పనులు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయంలో బోలెడు ఆర్థిక లాభాలు కలుగుతాయి.   

తులారాశి వారు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న డబ్బులు కూడా అందుకుంటారు. అంతేకాకుండా గతంలో తీసుకున్న అప్పులు కూడా తిరిగి చెల్లించ గలుగుతారు. వీరికి ఈ సమయంలో అదృష్టం పెరగడం కారణంగా ఎలాంటి పనులు చేసిన అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.   

మకర రాశి వారికి డిసెంబర్ 28వ తేదీ నుంచి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కెరీర్ కు సంబంధించిన జీవితంలో ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే వీరు అద్భుతమైన అదృష్టాన్ని పొంది.. ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఈ సమయంలో శుభవార్తలు పొందుతారు.  

అలాగే మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా మారుతాయి. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన డబ్బులు పొందగలిగే అదృష్టాన్ని కలిగి ఉంటారు. దీంతోపాటు డబ్బులు ఆదా చేయడంలో కూడా విజయాలు సాధిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే వీరికి ఈ సమయంలో సంపాదన కూడా రెట్టింపు అవుతుంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link