Aditi Rao First Husband: అదితి రావు హైదరి మొదటి భర్త ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు..తెచ్చుకున్న అదితి రావు హైదరి, తెలుగు కంటే ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేసి మంచి పేరు దక్కించుకుంది. ఇండస్ట్రీలోకి రాకమునుపే అనగా 2002లో సత్య దీప్ మిశ్రా ను వివాహం చేసుకొని, 2012లో తన భర్తకు విడాకులు ఇచ్చి సినిమాలపైనే ఫోకస్ చేసింది. అయితే ఈమధ్య కొంతకాలంగా హీరో సిద్ధార్థ తో ప్రేమలో పడిన ఈమె, ఈ ఏడాది మార్చి 27 న వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ లోని రంగనాథ స్వామి ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు.
ఇక నిన్న అదే ఆలయంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట మూడు ముళ్ళు, ఏడడుగులతో ఒక్కటయ్యారు. తాజాగా పెళ్లికి సంబంధించిన ఫోటోలను అదితి రావు హైదరి సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో పలువురు సెలబ్రిటీలు , అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన పలు విషయాలు వైరల్ గా మారగా.. అందులో భాగంగానే అదితి రావు హైదరి మొదటి భర్త గురించి కూడా కొన్ని విషయాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇక ఈమె మొదటి భర్త ఎవరు? ఆయన ఏం చేస్తుంటారు..? అనే విషయాలు వైరల్ గా మారడం గమనార్హం.
అసలు తన మొదటి పెళ్లి గురించి ప్రస్తావించని అదితి రావు హైదరి.. విడాకుల తర్వాత 2013లో తొలిసారి మొదటి పెళ్లి గురించి స్పందించింది. ఇండస్ట్రీలోకి రాకముందు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ గా, కార్పొరేట్ లాయర్ గా పనిచేసిన సత్యదీప్ మిశ్రా ను వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఈయన ముంబైలో అడ్వర్టైజింగ్ ద్వారా కెరియర్ ను మొదలుపెట్టారట చిల్లర పార్టీ ఈయన మొదటి సినిమా.
సత్యదీప్ సినిమాలలో ఎక్కువగా గుర్తింపు రాకపోవడంతో ఓటీటీ వైపు మొగ్గు చూపారు. పలు సిరీస్లలో కూడా కనిపించారు.. ఇక 2012 లోఅదితి రావు హైదరితో విడాకులు తీసుకున్న ఈయన 2013 జనవరి 27న మీనా గుప్తా కూతురు ముసాబా గుప్త ని వివాహం చేసుకున్నారు. ముసాబా కి కూడా ఇది రెండో వివాహం కావడం గమనార్హం.