Silver Rate: బంగారంపై మోజు తగ్గిందా? వెండికి క్రేజ్ పెరిగిందా?..భవిష్యత్తులో చుక్కల్లో వెండి ధర.. ఎందుకంటే?
Silver Rate: సాధారణంగా బంగారం ధర భారీగా పెరుగుతుంది. ఎందుకంటే బంగారానికి ఉన్న క్రేజ్ అలాంటిది. కానీ వెండిని మాత్రం ఎవరూ పట్టించుకోరు. అయితే రానున్న రోజుల్లో బంగారం ధర తగ్గుతుందని వెండి పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేసాయి. అన్నాట్లుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వెండి ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. లక్ష దాటుతుందనకున్న బంగారం ధర యూటర్న్ తీసుకోగా..లక్ష అవుతుందా వెండికి అంత డిమాండ్ ఉందానుకుంటే లక్ష దాటడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు వెండికి అంత డిమాండ్ ఎందుకు పెరిగింది. భవిష్యత్తులో బంగారాన్ని మించిపోనుందా. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బలమైన గ్లోబల్ ట్రెండ్, స్థానిక ఆభరణాల విక్రేతల జోరుగా కొనుగోళ్ల మధ్య గురువారం రెండు రోజుల భారీ పతనం తర్వాత ఈ రోజు బులియన్ ధరలు విపరీతంగా పెరిగాయి. గురువారం ఢిల్లీలో వెండి ధర రూ.5200 భారీ పెరుగుదల నమోదైంది. నేటి పెరుగుదలతో ఢిల్లీలో వెండి ధర రూ.95,800కి చేరింది. ఈ రోజు నమోదైన వెండి ధర ఇప్పటివరకు ఒక్క రోజులో పెరిగిన అతిపెద్ద పెరుగుదల అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ వెండి ధరకు సంబంధించి ఈ తాజా అప్‌డేట్‌ను షేర్ చేసింది.
వరుసగా రెండు రోజులు వెండి ధర భారీగా తగ్గింది. మంగళవారం ఢిల్లీలో వెండి ధర రూ.1100 తగ్గింది. ఆ తర్వాత కిలో వెండి ధర రూ.90,600కి తగ్గింది. అంతకు ముందు సోమవారం కూడా వెండి ధర రూ.1600 భారీ పతనం కనిపించింది. ఢిల్లీలో సోమవారం వెండి ధర తగ్గిన తర్వాత, కిలో ధర రూ.91,700 వద్ద ముగిసింది. గత వారం శుక్రవారం వెండి ధర రూ.300 పెరిగి, బుధవారం రూ.500 తగ్గింది. కానీ గురువారం ఒక్కరోజే రూ. 5,200 పెరిగింది.
దీనికి సంబంధించి, బుధవారం ఫ్యూచర్స్ ట్రేడ్‌లో వెండి ధరలు కిలోకు రూ. 840 పెరిగి రూ. 89,090కి చేరుకున్నాయి. ఎందుకంటే బలమైన స్పాట్ డిమాండ్ మధ్య వ్యాపారులు తమ డీల్‌ల పరిమాణాన్ని పెంచారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్‌లో డెలివరీ కోసం వెండి కాంట్రాక్ట్ ధర కిలోకు రూ.840 లేదా 0.95 శాతం పెరిగి రూ.89,090కి చేరుకుంది.
ఇందులో 12,219 లాట్ల వ్యాపారం జరిగింది. దేశీయ మార్కెట్‌లో బలపడుతున్న ధోరణి కారణంగా, ట్రేడర్లు తాజా డీల్స్‌ను కొనుగోలు చేయడంతో వెండి ఫ్యూచర్స్ ధరలు పెరిగాయని నిపుణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా, న్యూయార్క్‌లో వెండి ధర ఔన్స్‌కు 0.76 శాతం పెరిగి 31.67 డాలర్లకు చేరుకుంది.
అంటే వచ్చే ఏడాది 2025 డిసెంబర్ నాటికి లేదా 2026 మార్చి నాటికి వెండి కేజీ ధర రూ. లక్ష 25వేల రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిమాండ్ కూడా అలాగే ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ తెలిపింది.
2024 అక్టోబర్ 28వ తేదీన కిలో వెండి లక్షా 7వేలకు చేరుకుంది. కొనుగోళ్ల నుంచి మంచి డిమాండ్ ఏర్పడింది. కొన్నాళ్లు వెండి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. స్వల్పంగా తగ్గినట్లే తగ్గి మరోసారి భారీ పెరుగుదలను నమోదు చేసింది.
బ్యాంకుల వడ్డీ రేట్లతో ఎలాంటి సంబంధం లేకుండా భవిష్యత్తులో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని సిల్వర్ ఇన్ స్టిట్యూట్ కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది. వెండి ధరలు పెరగడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒక కారణమని చెబుతున్నారు నిపుణులు. ఏఐకీ వెండికి సంబంధం ఏంటంటే ఏఐలో వాడే చిప్స్ తయారీలో వెండి కీలకం మారుతుంది. దీంతో రానున్న రోజుల్లో ఏఐ మరింత విస్తరిస్తుంది. దీంతో వెండి భారీగా పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.