Rice free from insects: బియ్యం తొందరగా పురుగులు పడుతున్నాయా..?.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..
మనం బియ్యంను నీళ్ల పదును ఉండే ప్రదేశాలలో లేదా నీళ్లు ఉండే చోట అస్సలు పెట్టకూడదు. పచ్చి నీళ్లతో బియ్యం సంచిలో చేతులు పెట్టకూడదు. ఇలా చేస్తే వెంటనే బియ్యానికి పురుగులు పట్టడం జరుగుతుంది.
బియ్యంను పురుగులు పట్టకూడదంటే కొన్ని కిచెన్ టిప్స్ పాటించాలి. బియ్యం సంచిలో.. వేప ఆకులను వేయాలి. దీని నుంచి వచ్చేచేదు వాసన వల్ల పురుగులు అనేవి బియ్యానికి పట్టవు.
ఇక బియ్యంలో లవంగాలు వేసిన కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అందుకు బియ్యం బస్తా అడుగు భాగంలో.. లవంగాలను వేయాలి.
బిరియానీ ఆకులనుంచి ఒక రకమైన ఘాటు వాసన వస్తుంది. అందుకే ముఖ్యంగా.. వంటలు చేసేటప్పుడు బిర్యానీ ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందు వల్ల బియ్యం సంచిలో బిరాయాని ఆకులు ఉంచిన కూడా మంచి రిజల్ట్ ఉంటుంది.
వెల్లుల్లీ, ఎండు మిరపకాయలను కూడా బియ్యం సంచిలో వేస్తే పురుగులు పట్టవని నిపుణులు చెబుతుంటారు. అందుకే బియ్యం సంచిలో ఈ పదార్థాలు వేస్తుంటే, బియ్యం అనేవి తొందరగా పురుగులు పట్టవని చెబుతుంటారు.
ఇక పూదీనా ఆకులు పెట్టిన మంచి ఫలితం ఉంటుందని చెబుతుంటారు. పూదీనా ఆకులను ఎండిపోయిన తర్వాత పౌడర్ గా చేసిన, బియ్యం సంచిలో వేస్తే అస్సలు పురుగులు పట్టవని చెప్తుంటారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)