Anti Dandruff Shampoo: మీ సాధారణ షాంపూని ఇలా నిమిషంలో యాంటీ డాండ్రఫ్ షాంపూగా మార్చేయండి..
చలికాలం లేదా ఇతర కారణాల వల్ల మన జుట్టులో డాండ్రప్ సమస్య ఎక్కువవుతుంది. దీనివల్ల హెయిర్ ఫాల్ సమస్యలు కూడా పెరుగుతాయి. తల విపరీతంగా దురదగా ఉంటుంది. జుట్టులో చుండ్రు సమస్య మొదట్లోనే తగ్గించుకోవాలి. మార్కెట్ నుంచి ఏవైనా యాంటీ డాండ్రఫ్ షాంపూలను తీసుకున్న కొన్నిసార్లు అవి పనిచేయవు. మరికొన్నిసార్లు వాటిలో ఉన్న కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కు దారితీస్తుంది. కొన్ని చిట్కాలతో మీ సాధారణ షాంపూను ఇంట్లో ఉండే వస్తువులతో సులభంగా యాంటీ డాండ్రఫ్ షాంపూగా మార్చుకోవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం.
నిమ్మరసం.. నిమ్మరసంలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి డాండ్రఫ్ కు వ్యతిరేకంగా పోరాడతాయి. అంతేకాదు ఇందులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు జుట్టులోని చుండ్రును అరికడుతుంది. మీ రెగ్యులర్ షాంపూలో ఒక చెంచా నిమ్మరసం కలిపి కుదుళ్ల నుంచి బాగా సున్నితంగా మర్దన చేసుకోవాలి. కావాలంటే షాంపూ, నిమ్మరసం రెండూ కలిపి సమపాళ్లలో కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టు శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేసినా మంచి ఫలితం వస్తుంది.
వేపనూనె.. ఇది ఇప్పటి కాలం కాదు మన బామ్మల కాలం నుంచే వేపాకును ఉడికించి ఒళ్లంతా దురద ఉన్నప్పుడు స్నానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. వేపనూనె, పొడి రూపంలో కూడా మనకు లభిస్తుంది. నేరుగా చెట్టు నుంచి కోసి ఉడికించిన నీటితో తలస్నానం చేసినా దురద పోతుంది. వేపనూనెను సాధారణ షాంపూలో కలపండి. సింపుల్ గా అది యాంటీ డాండ్రఫ్ షాంపూ అయిపోతుంది. ఇది నేచురల్ రెమిడీ కూడా. వేపలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. దీంతో దురద సమస్యను తక్షణమే వదిలిస్తుంది.
టీ ట్రీఆయిల్.. టీ ట్రీఆయిల్ లో యాంటీ బ్యాక్టిరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది చుండ్రు సమస్యను సమర్థవంతంగా వదిలిస్తుంది. మీ సాధారణ షాంపూలో కొన్ని చుక్కల టీ ట్రీఆయిల్ కలిపి జుట్టుపై మసాజ్ చేయండి. ఆ తర్వాత సాధారణ నీటితో తలస్నానం చేసుకోండి. దీనివల్ల జుట్టు నిగారింపు కూడా వస్తుంది. హెయిర్ ఫాల్ సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.
కలబంద.. చుండ్రు సమస్యకు కలబంద చాలా మంచి రెమిడీ. దీన్ని అనేక చర్మ, జుట్టు సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. దీనికి మాత్రమ మార్కెట్లో కొనుగోలు చేసుకోండి. ఒక స్పూన్ కలబంద, ఒక స్పూన్ షాంపూ ఇలా సమపాళ్లలో తీసుకుంటే యాంటీ డాండ్రఫ్ షాంపూ రెడీ అయినట్లే. దీంతో జుట్టులో దురద సమస్య కూడా తగ్గిపోతుంది. మీ జుట్టు మరింత నిగారింపు కూడా వస్తుంది.