Singer Chinmayi: అలాంటప్పుడు మగాళ్లు పెళ్లికి ముందు శృంగారం చేయకూడదు.. స్టార్ సింగర్ సంచలన కామెంట్..!
ఇటీవల డిసెంబర్ 31వ తేదీ ఎక్కువ శాతం కండోమ్ ప్యాకెట్లు ఆర్డర్ పెట్టారు అనే అంశం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈసారి చిన్మయి ఈ అంశంపై స్పందించింది. తాజాగా బ్లింకిట్ సీఈఓ 31 డిసెంబర్ లక్షకుపైగా కాండోమ్ ప్యాకెట్లు తమ ప్లాన్‌ఫార్మ్‌పై సేల్ అయ్యాయని ఆయన రాసుకొచ్చారు. దీనిపై భిన్న స్పందనలు వచ్చాయి.
ఓ ఎక్స్ యూజర్ దీనిపై స్పందిస్తూ కేవలం ఈ ప్లాట్‌ఫామ్‌పైనే ఇంత సేల్ అవుతే ఇతర ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై దాదాపు కోటీ సేల్ అయి ఉండొచ్చు. ఈకాలంలో వర్జిన్ అమ్మాయి దొరకడం లక్ అని ట్వీట్ చేశారు.
సింగర్ చిన్మయి ఈ ట్వీట్‌పై స్పందించారు. అలాంటప్పుడు మగవారు పెళ్లికి ముందు సెక్స్ చేయొద్దు అని కామెంట్ చేశారు. ఇక చిన్మయి కామెంట్‌కు నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం చిన్మయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిన్మయ్ హిందీ సినిమాలకు కూడా పనిచేశారు. మొదట సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన చిన్మయి ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారారు. ఈమె యాక్టర్ రాహుల రవీందర్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇక ఆ మధ్యకాలంలో వచ్చిన మీటూ మూమెంట్ నుంచి చిన్మయ్ మరింత పాపులర్ అయ్యారు. తమిళ మ్యూజిక్ రంగంలో జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఆమె అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైరముత్తు, కార్తీక్ గురించి సంచలన కామెంట్స్ చేశారు.