Singer Sunitha: ఆవేశంతో ఊగిపోయిన సింగర్ సునీత..?.. ఏకంగా ఇన్ స్టాలో అలా అడిగేసిన నెటిజన్..

Sat, 16 Nov 2024-6:24 pm,

కొంత మంది సోషల్ మీడియాలో నీచంగా తయారయ్యారని చెప్పవచ్చు. మెయిన్ గా నటి నటుల వ్యక్తిగత జీవితం, పెళ్లి, ప్రేమలు వీటి మీద రూమర్స్ ను వ్యాప్తి చెందిస్తున్నారు. అసలు ఏచేయకపోయిన అంత జరిగిపోయిందని రూమర్స్ వైరల్ చేస్తున్నారు.  

మరికొందరైతే. .బతికి ఉన్నవాళ్లను చంపేస్తున్నారు... హీరోయిన్ లు ఎవరితోనైన కలిస్తే వారి మధ్య రిలేషన్ పెట్టేస్తున్నారు. పెళ్లైన వాళ్లకు డైవర్స్ అని .. పెళ్లి జరిగితే గర్భవతులని పిచ్చిపిచ్చిగా థంబ్ నైల్స్ పెడుతున్నారు.

ఇంకా వివాహాం అయ్యాక కొన్ని రోజులకు డైవర్స్ తీసుకుంటున్నారని కూడా ఇలా పోస్టులు పెడుతున్నారు. డైవర్స్ తీసుకుంటే.. ఆ హీరోతో ఎఫైర్, ఈ డైరెక్టర్ తో ప్రేమాయణం అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.  

ఇటీవల సింగర్ సునీత కూడా మళ్లీ రూమర్స్ బారిన పడ్డారు. ఆమె ఇటీవల రామకృష్ణ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె డబ్బులున్న బిజినెస్ మెన్ ను చూసి పెళ్లి చేసుకుందని అన్నారు. అంతే కాకుండా.. ఆమె ప్రెగ్నెన్సీపై లేనిపోనీ పొస్టులు పెట్టారు. చివరకు ఆమె భర్తతో గొడవలు పడి, విడిపోతుందని కూడా పోస్టులు పెట్టేశారు. దీంతో ఆమె వీటిని గతంలో ఖండించిన విషయం తెలిసిందే.   

తాజాగా, మళ్లీ సోషల్ మీడియాలో సునీతకు చెదు అనుభవం ఎదురైందంట. ఒక నెటిజన్ నువ్వు ఒక్కదానివే ఎప్పుడు రీల్స్ చేస్తావ్.. మీ ఆయన ఎక్కడ అని అడిగాడంట. నువ్వు ఒక్కదానివే హ్యాపీగా ఉంటూ రీల్స్ చేస్తు.. సమాజంకు ఏం మెస్సెజ్ ఇస్తున్నావ్ అన్నాడంట.   

దీంతో సునీత ఫ్యాన్ రంగంలోకి దిగి.. ఇలాంటి కామెంట్స్ చేయడం మానుకొవాలని చురకలు పెట్టిందంట. దీనిపై సునీత కూడా కాస్త సీరియస్ గా మాట్లాడినట్లు సమాచారం. ఒకరి వ్యక్తిగత జీవితాల గురించి లేనీ కల్పితాలతో.. నీచంగా మాట్లాడటం మానుకొవాలన్నారంట.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link