Skin Care Tips: నలభైలో సైతం ఇరవైలా కన్పించే అద్భుతమైన ఐదు పదార్ధాలివే, నెలరోజుల్లోనే ఫలితం
నట్స్, డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని యౌవనంగా ఉంచుతాయి. అందుకే రోజూ డైట్‌లో వీటిని భాగంగా చేసుకోవాలి.
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఆకుకూరలు వారంలో కనీసం 4 సార్లు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి నిగారింపు వస్తుంది.
బ్లూ బెర్రీస్ రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం నిత్య యౌవనంగా కన్పిస్తుంది. ముఖానికి కూడా రాసుకోవచ్చు. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి చాలా లాభదాయకం.
విటమిన్ ఇ, విటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికే కాకుండా చర్మానికి చాలా అవసరం. ఈ పోషక పదార్ధాలు పుష్కలంగా లభించే అవకాడో రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అవసరమనుకుంటే అవకాడో గుజ్జును ముఖానికి రాసుకోవచ్చు.
బొప్పాయి చర్మానికి చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇందులో చాలా విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మానికి లాభాన్ని కలగజేస్తాయి. బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.