Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

డ్రై స్కిన్
డ్రై స్కిన్ సమస్యకు పచ్చిపాలు చాలా లాభదాయకం. చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ అందిస్తుంది. ముడతలు తగ్గిపోతాయి..

ట్యానింగ్
ముఖానికి కాంతి తీసుకొచ్చేందుకు పచ్చిపాలు రాయాలి. ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు పచ్చిపాలు రాసి మసాజ్ చేస్తుంటే ట్యానింగ్ సమస్య దూరమౌతుంది..

మొటిమల సమస్య
పచ్చి పాలు రాయడం వల్ల ముఖంపై కంటి కింద ఉండే డార్క్ సర్కిల్స్ దూరమౌతాయి. దాంతోపాటు మొటిమలు కూడా దూరమౌతాయి. రాత్రి సమయంలో పచ్చిపాలతో కాస్సేపు మస్సాజ్ చేయాలి.
డెడ్ సెల్స్
పచ్చిపాలు ముఖానికి రాయడం వల్ల ముఖచర్మంపై ఉండే డెడ్ సెల్స్ దూరమౌతాయి. ఉదయమయ్యేసరికి ముఖం నిగనిగలాడుతుంటుంది. ఇందులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ ముఖాన్ని శుభ్రం చేస్తుంది.
గ్లోయింగ్ ఫేస్
ముఖం నిగనిగలాడుతుండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికోసం రాత్రి వేళ పచ్చిపాలను ముఖానికి రాసుకోవాలి. ఇందులో ఉండే కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, ప్రోటీన్ వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.