Itching in Palms: చేతులు తరచూ దురద పెడుతున్నాయా, ఈ ప్రమాదకర వ్యాధులు కావచ్చు
డయాబెటిస్
డయాబెటిస్ రోగులకు బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నప్పుడు కూడా చేతులు దురదగా ఉంటాయి. రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. చేతులపైనే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలకు కూడా ఉంటుంది
ఫంగల్ ఇన్‌ఫెక్షన్
ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సమస్య ఉంటే చేతులపై తరచూ దురద వస్తుంటుంది. వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.
ఎలర్జీ
సాధారణంగా చర్మం చాలా సెన్సిటివ్ గా ఉండటం వల్ల అలర్జీ బారిన పడుతుంటుంది. కొన్ని వస్తువులతో ఎలర్జీ ఉన్నప్పుడు వాటిని ముట్టుకుంటే చాలు దురద వస్తుంటుంది. ఎలర్జీ ఉండే వస్తువులకు దూరంగా ఉండాలి
సోరియాసిస్
చర్మంలోని కణజాలాలు అపరిమితంగా వృద్ధి చెందుతున్నప్పుడు చర్మంపై అవి పేరుకుపోతాయి. దీనినే సోరియాసిస్ అంటారు. ఇలా ఉంటే చేతులు, శరీరంలోని ఇతర అవయవాలపై దురద విపరీతంగా ఉంటుంది.
ఎగ్జిమా
ఇక ఎటోపిక్ డెర్మటైటిస్ లేదా ఎగ్జిమా సమస్య ఉన్నప్పుడు కూడా చేతుల్లో దురద ఎక్కువగా ఉంటుంది. చర్మంపై చిన్న చిన్న మొటిమల్లాంటివి కూడా కన్పిస్తాయి. ఎర్రని ర్యాషెస్ రావచ్చు.