Smartphone Secure Tips: ఈ టిప్స్ పాటిస్తే మీ స్మార్ట్ ఫోన్‌ను సైబర్ దాడుల్నించి కాపాడుకోవచ్చు
స్మార్ట్ ఫోన్ పాస్ వర్డ్ ఎప్పుడూ బలంగా ఉండాలి. అంటే న్యూమెరికల్, ఆల్ఫాబెట్స్, బ్రాకెట్స్ వంటివాటితో ఉండాలి. దీంతోపాటు బయోమెట్రిక్, ఫేసియల్ ఐడీ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలి. బయట ఏర్పాటు చేసే యూఎస్ బి చార్జింగ్ స్టేషన్లలో ఫోన్ ఛార్జ్ చేసుకోవద్దు. అవసరం లేనప్పుడు లొకేషన్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ మెయిల్ లేదా టెక్స్ట్ మెస్సేజ్ ద్వారా వచ్చే లింక్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. పబ్లిక్ వైఫై వినియోగించాల్సి వస్తే వీపీఎన్ కనెక్షన్ చెక్ చేసుకోవాలి. బ్లూటూత్ ఆఫ్ చేయాలి.
స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇచ్చే సాఫ్ట్‌వేర్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. ముఖ్యంగా సెక్యూరిటీ అప్‌డేట్స్ మర్చిపోకూడదు. యాప్ స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి
కొన్ని ప్రమాదకరమైన యాప్స్, వైఫై నెట్‌వర్క్ ద్వారా సైబర్ దాడి జరగవచ్చు. స్పైవేర్ ద్వారా వ్యక్తిగత సంభాషణలు పర్యవేక్షించవచ్చు. రిమోట్ యాక్సెస్ ద్వారా డేటా తస్కరించే అవకాశాలున్నాయి. అందుకే పబ్లిక్ వైఫై వాడకపోవడం మంచిది
స్మార్ట్ ఫోన్‌ను వారంలో ఒక్కసారైనా స్విచ్ ఆఫ్ చేసి రీ స్టార్ట్ చేస్తుండాలి. వివిధ మార్గాలనుంచి జరిపే సైబర్ దాడులనుంచి తప్పించుకోవచ్చు. మీ ఫోన్ లో మీకు తెలియకుండా మాల్ వేర్ ఇన్ స్టాల్ చేయడం వంటివి నియంత్రించవచ్చు.