Snake Bite:నల్ల త్రాచు, బ్లాక్ మాంబా కరిచిన నో టెన్షన్.. సరికొత్త విరుగుడును కనిపెట్టిన సైంటిస్టులు..

Tue, 05 Mar 2024-1:41 pm,

మనలో ప్రతిఒక్కరు పాములంటే భయంతో వణికిపోతుంటారు. పాములు కన్నిస్తే  ఆ ప్రదేశాలకు వెళ్లరు. ఇంట్లో చెట్లు, పొదలు, ఎలుకలు ఉంటే పాములు అక్కడ తప్పకుండా ఉంటాయి. అందుకు ఇళ్లను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకొవాలి. సాధారణంగా అనుకోకుండా పాము కాటుకు గురైతే.. కొందరు భయంతో అక్కడిక్కడే చనిపోతారు.   

కానీ మరికొందరు మాత్రం.. కాటు వేసిన పామును పట్టుకుని ఆస్పత్రికి వెళ్తారు. అక్కడ యాంటీ వీనమ్ ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఇలాంటిది మనకు తెలిసిందే. ఏపాము కుట్టిందో తెలిస్తే వైద్యులు దానికి సరిపోయే విధంగా యాంటీ వీనమ్ ఇస్తారు. దీంతో బాధితుడు బతకడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇది కొన్నిసార్లు విఫలం కూడా అయ్యే అవకాశం ఉంది. 

ఇదిలా ఉండగా.. పాము కాటుకు ఒక్కసూది మందుతో ప్రాణాలు కాపాడే యంటీ బాడీని సైంటిస్టులు రూపొందించారు. అత్యంత విషపూరిమైన పాములైన నల్లత్రాచు, బ్లాక్ మాంబాలు ఎవరినైన కుడితే, సెకన్లు వ్యవధిలో ప్రాణాలు పొవాల్సిందే. కానీ ఇప్పుడు దీని కాటు నుంచి కూడా బైటపడోచ్చు.  స్క్రిప్స్ రీసెర్చ్ సైంటిస్టులు 95 మ్యాట్ 5 ను తయారు చేశారు. దీన్ని తొలుత ఎలుకలపై టెస్ట్ కూడా చేశారు. 

నల్లత్రాచు, బ్లాక్ మాంబాలతో ఎలుకను కాటువేయించారు. ఆతర్వాత విరుగుడును దానిలో ప్రవేశ పెట్టారు. అప్పుడు ఎలుక ప్రాణాలతో బైటపడింది. దీంతో ఇది మనుషులకు కూడా ఉపయోగించవచ్చని వైద్యులు పేర్కొన్నారు.  ఇది ప్రాణాలనే కాదు.. అవయవాలు చచ్చుబడకుండా కూడా కాపాడుతుంది.   

కొన్ని చోట్ల పాముకాటులకు ఇచ్చే ఇంజక్షన్ ల వల్ల బాధితులు ప్రాణాలు కొల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే... పాము కాటు చికిత్సలో యాంటీ వీనమ్  ఇంజక్షన్ లు ఇస్తుంటారు. దీనిలో ముందుగా పాముల నుంకి విషాన్ని గ్రహిస్తారు. గుర్రాలలో ఇంజక్ట్ చేస్తారు. అప్పుడు వాటి నుంచి విషంను ఎదుర్కొనే కణాలను సేకరిస్తారు.  

వీటిని పాములు కుట్టిన బాధితులకు  ఇంజక్షన్ రూపంలో ఇస్తారు. కానీ కొన్నిసార్లు అలర్జీలు , విషాలకు అంతిగా పనిచేయకపోవడం వంటి ఘటనలు కూడా జరిగాయి. అనేక ఇబ్బందులు ఎదురౌతుంటాయి. కొత్తగా తయారు చేసిన విరుగుడును ప్రయోగశాలలో తయారు చేశారు. 

ఇది పాము విషాన్ని పూర్తిగా విరుగుడుగా పనిచేస్తుందని న్యూరోటాక్సిన్ నాడులపై ప్రభావం చూపించకుండా చేస్తుందని చెబుతుంటారు. హెచ్ఐవీ టీకీ తయారు చేసిన విధానంలోనే 95మ్యట్5 ని రూపొందించారని వైద్యులు చెబుతున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link