Sobitha Dhulipala: బ్లాక్ కలర్ డ్రెస్‌లో సెగలు పుట్టిస్తోన్న అచ్చ తెలుగు అందం శోభితా ధూళిపాల..
శోభితా ధూళిపాల.. అచ్చ తెలుగు అందం.. ముందుగా హిందీ సినిమా 'రమన్ రాఘవ్ 2.O' మూవీతో కథానాయికగా పరిచయం అయింది.
హిందీ సినిమాతో ప్రారంభమైన ఈమె ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళంలో హీరోయిన్గా తన లక్‌ను పరీక్షించుకుంది.
31 మే 1992 ఆంధ్ర ప్రదేశ్ తెనాలిలో జన్మించిన ఈమె.. ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది.
తెలుగులో అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
కేవలం సినిమాలే కాదు.. 'మేడ్ ఇన్ హెవన్', 'బర్డ్ ఆఫ్ బ్లడ్', 'ది నైట్ మేనేజర్' వంటి సిరీస్‌లో నటించి మెప్పించింది.
ప్రస్తుతం సినిమాలతో పాటు.. యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది.