Somavati Amavasya: శక్తివంతమైన సోమవతి అమావాస్య.. రేపు ఈ ఒక్కపని చేస్తే న్యూ ఇయర్ అంతా మీకు శుభవార్తలే..!
సాధారణంగా జ్యోతిష్య పండితుల ప్రకారం అమావాస్య అనేది చెడును పొగొడుతుందని చెబుతుంటారు. కానీ కొందరు మాత్రం.. అమావాస్య మంచిది కాదని అనుకుంటారు. అది నిజం లేదని మరికొందరు జ్యొతిష్యలు సూచిస్తుంటారు.
మనం దీపావళి పండుగను జరుపుకుంటాం. చెడుపై మంచి సాధించిన విజయానికి అమావాస్య రోజున దీపాలు వెలిగిస్తాం. అదే విధంగా అమావాస్య అనేది చనిపోయిన పూర్వీకులకు ఎంతో ఇష్టమైన తిథిగా చెబుతుంటారు.
ధనుర్మాసంలో ప్రస్తుతం ఏడాది చివరలో అమావాస్య తిథి వస్తుంది. అయితే.. ఈ ఏడాది డిసెంబరు 30న అంటే సోమవారం అమావాస్య వస్తుంది. అందుకే ఈరోజున మనం సోమవతి అమావాస్యను జరుపుకోబోతున్నాం.
ఈరోజున కొన్ని పరిహారాలు పాటిస్తే.. న్యూ ఇయర్ మొత్తం శుభవార్తలే వినే ఆస్కారం ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా సోమవారం అమావాస్య రావడం వల్ల.. సోమవతి అమావాస్య అని పిలుస్తుంటారు. ఈ రోజున శివయ్యకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరలతో అభిషేకం చేయాలంటారు.
దీనితో పాటు.. ఐదు రకాల ఫలాలలతో, అన్నంతో అభిషేకం చేస్తే రాజయోగంతో పాటు.. ధనం వారి ఇంట్లో ఎల్లప్పుడు ఉంటుందంట. అంతే కాకుండా.. చనిపోయిన మన పూర్వీకుల కోసం పిండ ప్రదానాలు, గంగా స్నానాదులు కూడా చేస్తే అఖండ పుణ్యం ప్రాప్తింస్తుందంట.
అందుకే సోమవతి అమావాస్య రోజున ముఖ్యంగా సూర్యోదయంకు ముందే నిద్రలేచీ ఈ పూజాలు చేయాలని పండితులు చెబుతున్నారు. మూగ జీవాలు, పెదలకు అన్నదానాలు తమ శక్తాను సారం చేయాలని కూడా పండితులు సూచిస్తున్నారు.