Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..
వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. ఈ కాలంలో పాములు ఎక్కువగా అడవుల నుంచి బైటకు వస్తుంటాయి. దట్టమైన చెట్లు ఉన్న చోట ఉంటాయి. ఎలుకల కోసం మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. పొలాల్లో కూడా పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి..
చాలా మంది పాములు కన్పించగానే స్నేక్ సోసైటీ వాళ్లకు సమాచారం అందిస్తారు. కానీ మరికొందరు మాత్రం.. పాములు ఎదురైన చంపుతుంటారు. చంపిన పాములతో ఆస్పత్రులకు వెళ్తుంటారు.
జ్యోతిష్య పండితులు మాత్రం పాముల్ని చంపకూడదని చెప్తుంటారు. పాముల్ని చంపడం వల్ల కాలసర్పదోషం కల్గుతుందని చెబుతుంటారు. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయని అంటారు. కొన్నిరకాల చెట్లను ఇంట్లో పెంచుకుంటే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు.
ముఖ్యంగా.. ఇండికా పాముకాటుకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్తుంటారు. నేల వాము చెట్టు కూడా పామువిషంను హరిస్తుందని చెప్తుంటారు. దీని ఆకులను మెత్తగా దంచి నూనెలో కలిపి తినాలంట. ఇది తిన్నప్పుడు ఎంతో చేదుగా ఉంటుంది. కానీ పాము విషం ఉన్న వారు తింటే మాత్రం తియ్యగా ఉంటుందంట..
పాము కాటుకు గురైన వారు.. ఇది తిని చేదుగా వచ్చేదాక తినాలని నిపుణులు చెబుతున్నారు. మోరింగా ఒలిఫెరా, బంజరు వంటి మొక్కలు పాముకాటును నివారిస్తుందంట. వీటితో పాటు.. అకోరస్ కలామస్, బుకానానియా లాంజాన్ (కాండం బెరడు) వంటి మొక్కలు కూడా పాముకాటు విషంను హరిస్తాయంట.
అదే విధంగా..మోరింగ ఒలిఫెరా (కాండం, ఆకులు), అకిరాంథెస్ ఆస్పెరా, జినాండ్రోప్సిస్ గైనండ్రా, బొంబాక్స్ సీబా వంటి మొక్కల కూడా పాము విషంను తొలగించడంలో ఉపయోగపడుతుంది. రైజోమ్ జాతీకి చెందిన పేస్ట్ కూడా పాము కాటుకు విరుగుడుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)