South Heroes Instagram Followers: అల్లు అర్జున్ సహా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సౌత్ హీరోలు వీళ్లే.. Part 1
1.అల్లు అర్జున్ (Allu Arju).. ఒకప్పుడు హీరోలు తమను తాము ప్రమోట్ చేసుకోవడాని మీడియాను ఉపయోగించారు. సోషల్ మీడియా రాకతో అది వేరే లెవల్‌కి వెళ్లింది. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌ను అనుసరించేవారి సంఖ్య 25.3 మిలియన్స్ దాటింది. దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి ఇంత మంది ఫాలోవర్స్ ఉన్న తొలి కథానాయకుడిగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసాడు.
2. రామ్ చరణ్ (Ram Charan) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈయన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో 22.8 మిలియన్ ఫాలోవర్స్ అనుసరిస్తున్నారు. మొన్నటి వరకు 3వ ప్లేస్‌లో ఉన్న రామ్ చరణ్.. తాజాగా రెండో స్థానానికి చేరుకున్నారు.
3. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)
మొన్నటి వరకు అల్లు అర్జున్ తర్వాత దక్షిణాదిలో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ ఉండేవారు. తాజాగా ఈయన ఇన్‌స్టాలో 21.5 మిలియన్ ఫాలోవర్స్‌తో మూడో స్థానంలో నిలిచారు.
4. దుల్కర్ సల్మాన్ (dulqer salman) మలయాళీ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 14.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
5.యశ్ (yash) కేజీఎఫ్ సిరీస్‌తో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన హీరో యశ్. ఈయన్ని ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 13.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
6. మహేష్ బాబు (Mahesh babu) సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 13.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. టాప్ 6లో నిలిచారు.
7. సిలంబరస్ (శింబు) - Silambaras (Shimbu)
తమిళంలో అగ్ర హీరోగా రాణిస్తోన్న సిలంబరస్‌కు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో 13 మిలియన్ ఫాలోవర్స్‌తో టాప్ 7లో నిలిచారు.