Tirumala Tour: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఇక మీదట ప్రతిరోజు స్పెషల్ ఏసీ బస్సులు.. డిటెయిల్స్ ఇవే..

Wed, 31 Jul 2024-10:06 pm,

తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా  భావిస్తారు. ప్రతిరోజు కూడా  లక్షలాది మంది శ్రీవారి దర్శనం కోసం దూరప్రాంతాల నుంచి భారీగా తరలివస్తుంటారు.  అంతేకాకుండా... ఎన్నిగంటలైన స్వామి దర్శనం కోసం వివిధ కంపార్ట్ మెంట్ లలో వేచిచూస్తుంటారు.   

తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా.. మహరాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఇదిలా ఉండగా.. తిరుమలకు వెళ్లే రైళ్లు, బస్సులు ఎప్పుడు కూడా ఎప్పుడు బిజీగా ఉంటాయి. కనీసం నెలరోజుల ముందునుంచి ప్లాన్ లు చేసుకొవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో..ఏపీటీడీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ నుంచి తిరుపతికి ప్రత్యేకంగా ఏసీ బస్సును కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతిరోజు విజయవాడలోని బెంజీ సర్కిల్ లోని 4 వ పిల్లర్ వద్ద ఈ ఏసీ బస్సు ఆగుతుంది. అక్కడ నుంచి ప్రతిరోజు  రాత్రి 11 గంటలకు బయలు దేరి, తెల్లవారు జామున 6 కు తిరుమలకు చేరుకుంటుంది. 

అక్కడ ఫ్రెష్ అయిన తర్వాత తిరుమల, తిరుచానురు పద్మావతి అమ్మవారి దేవాలయందర్శనం కల్పిస్తారు. ఆతర్వాత భోజనం అయ్యాక.. మిగత ఆలయాలను దర్శనం చేసుకునేలా చేస్తారు. అదే రోజు రాత్రి పూట నుంచి ఏసీ బస్సు మరల తిరుపతి నుంచి రిటర్న్ అవుతుంది. ఈ బస్సు జర్నీలో భోజనం, వసతి, దర్శనం అన్ని కూడా వాళ్లే చూసుకుంటారు. 

ఏసీ బస్సులో ప్రయాణించడానికి పెద్దలు మాత్రం  రూ.3,970, పిల్లలు, రూ. 3,670 గా నిర్ణయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.  ఏపీ నుంచి అమరావతి, ఇతర ప్రదేశాల నుంచి తిరుమలకు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకొవచ్చు.దీన్ని సద్వినియోగం చేసుకొవాలని ఏపీటూరిజం శాఖ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. 

ప్రస్తుతం తిరుమలకు ప్రతిరోజు భక్తులు రైళ్లు, పర్సనల్ వాహనాలు, కొన్ని బస్సు మార్గాలలో వెళ్తున్నారు. ఈ సదుపాయం మరింత ఉపయోగకరంగా ఉంటుందని కూడా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link