Sravana Masam 2024: శ్రావణ మాసం.. సోమ, మంగళ, శుక్రవారాలు చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే..!
శ్రావణమాసం శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి ఏర్పడటం వల్ల అలా పిలుస్తారు. ఈ మాసంలో సోమ, మంగళ, శుక్రవారాల్లో చేసే పూజలు మంచి ఫలితాలు వస్తాయి. గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి.
ఆర్థిక సంక్షభంతో బాధపడుతున్నా, పెళ్లికానివారికి కూడా ఇది శుభ సమయం శుక్రవారం వీరు గోవుకు రొట్టె తినిపిస్తే అశేష ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో ఇలా చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.
శ్రావణ మంగళవారం రోజు వివాహాం కాని వారు, వైవాహిక సమస్యలు ఉన్నవారు మంగళగౌరి వ్రతం చేసుకోవడం, కుజగ్రహం వద్ద దీపాలు పెట్టడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిపూజ చేయడం వల్ల పెళ్లి సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.
శ్రావణ సోమవారాలు మానసిక ఇబ్బందులు ఉన్నవారు పంచామృతంతో శివుడికి అభిషేకం చేయాలి. పాలు, బిల్వపత్రంతో అభిషేకం చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి. శ్రావణ బుధవారం శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే అప్పుల బాధలు త్వరగా తొలగిపోతాయి.
గోమాతకు ఈ మాసంలో బెల్లం పెడితే శనిదోషం తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ మాసంలో మద్యం, మాంసానికి వీలైనంత దూరంగా ఉండాలి. ఇతరులను దూషించడం మానుకోండి.అంతేకాకుండా వెల్లుల్లి-ఉల్లిపాయ, ముల్లంగి, బెండకాయ తినకుండా ఉండండి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)