Sreeleela: పట్టు చీరలో శ్రీలీల సోయగాలు.. చూస్తే మతిపోవాల్సిందే..
శ్రీకాంత్ కొడుకు.. రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రీ లీల. మొదటి చిత్రంతోనే అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఆ తర్వాత రవితేజ తో వచ్చిన ధమాకా చిత్రంతో.. స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఒకేసారి 9 సినిమాలు సైన్ చేసి.. తెలుగు హీరోయిన్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ హీరోయిన్.
కాగా ఆ తొమ్మిది సినిమాలలో కేవలం రెండు సినిమాలు మాత్రమే విజయం సాధించటంతో.. ఈమధ్య శ్రీ లీల.. కథల ఎంపికలో చాలా జాగ్రత్త తీసుకుంటుందని వినికిడి. అందుకే ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా.. ఆచితూచి అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలో తమిళ సినిమాలు సైతం రెండు ఒప్పుకుందంట ఈ ముద్దుగుమ్మ. మరోపక్క అల్లు అర్జున్ పుష్పా సినిమాలో సైతం.. ఐటమ్ సాంగ్ లో కనిపించబోతుందని సమాచారం.
ఇక ఈ సాంగ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిందట. ఈ న్యూస్ లో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న శ్రీ లీల పేరు.. తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా.. మరింత వైరల్ అవుతుంది. శ్రీ లీలా తాజాగా షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలలో పట్టుచీర కట్టుకొని.. పొలాల మధ్య తిరుగుతూ.. తెగ అందంగా కనిపించింది. ఇక ఈ ఫోటోలు చూసి ఆమె అభిమానులు ఫిదా అయిపోతున్నారు.