Sreeleela: శ్రీలీలకు బ్యాడ్ టైమ్ స్టార్ అయిందా.. ? చేతిలో ఉన్న‌ది ఆ ఒక్క సినిమా మాత్ర‌మే..

Tue, 27 Feb 2024-9:27 am,

శ్రీలీల నటిగానే కాకుండా.. తన పర్సనల్ విషయాలతో వార్తల్లో నిలిచింది. రవితేజతో చేసిన 'ధమాకా'తో మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది.

గుంటూరు కారం సినిమాలో తనదైన డాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' చిత్రాలతో పలకరించింది.

2024లో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా ఓ మోస్తరు విజయంతో ఈ భామకు పెద్దగా ఒరిగిందేమి లేదు. కానీ ఈ సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్‌లో వేసిన స్టెప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

హీరోయిన్‌గా కెరీర్ పీక్స్ ఉన్న దశలో 'భగవంత్ కేసరి' మూవీలో బాలయ్య కూతురు పాత్రలో నటించి మెప్పించింది. శ్రీలీల సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న ఈమె ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్'లో కథానాయికగా నటిస్తోంది.

తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం సినిమాలతో పాటు MBBS చేస్తోంది. ఈ ఇయర్ ఈమె డాక్టర్ కంప్లీటయ్యే అవకాశాలున్నాయి.స్వతహాగా తెలుగు భామ అయిన ఆమె బెంగళూరులో పుట్టి పెరిగింది. అక్కడ కన్నడలో వచ్చిన 'కిస్' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది.

శ్రీలీల 20012లో జూలై 14న అమెరికాలో జన్మించింది. వీళ్లది తెలుగు ఫ్యామిలి కావడం విశేషం. ఈమె తల్లి ప్రముఖ గైనకాలిజిస్ట్. విదేశాల్లో పుట్టిన ఈమె బెంగళూరులో చదువు పూర్తి చేసుకుంది. పెళ్లిసందడి కంటే ముందు కిస్, భారతే వంటి కన్నడ సినిమాల్లో తన లక్ పరీక్షించుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link